IND vs BAN: భారత్- బంగ్లాదేశ్ మొదటి టీ20 మ్యాచ్‌పై నీలినీడలు! టెన్షన్‌లోక్రికెట్ ఫ్యాన్స్.. కారణమిదే
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటితో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం (అక్టోబర్ 6న) జరగనుంది. గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటితో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం (అక్టోబర్ 6న) జరగనుంది. గ్వాలియర్‌లోని న్యూ మాధవరావ్ సింధియా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు హిందూ మహాసభ గ్వాలియర్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా హిందూ మహాసభ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ను కూడా అడ్డుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో హిందూ మహాసభకు మరికొన్ని సంస్థల మద్దతు లభించింది. హిందూ మహాసభ బుధవారం తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారుల ప్రకారం, జిల్లా మేజిస్ట్రేట్, తన ఆదేశంలో, నిరసనలు, సోషల్ మీడియాలో వివాదాస్పద కంటెంట్‌ను వ్యాప్తి చేయడం నిషేధించారు. పోలీసు సూపరింటెండెంట్ సిఫారసు మేరకు జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ రుచికా చౌహాన్ ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ సెక్షన్ 163 కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం బౌండరీలో ఎవరైనా మ్యాచ్‌కు అంతరాయం కలిగించినా, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టినా చర్యలు తీసుకోనున్నారు. నివేదికల ప్రకారం, భద్రత కోసం స్టేడియం వెలుపల 1600 మంది పోలీసులను మోహరించారు.
ఈ మైదానంలో మధ్యప్రదేశ్ లీగ్ టోర్నీ జరిగింది. ఆ తర్వాత ఈ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. అందుకే, ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ అదే కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ‘జూన్‌లో ఆడిన 12 మ్యాచ్‌లలో, 200 పరుగుల మార్క్ నాలుగు సార్లు దాటింది. ఈ పిచ్ బ్యాటర్లకు బాా సహకరిస్తుంది. ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ పిచ్ ఇలాగే ఉంటుంది. గ్వాలియర్‌లోని ఇదే మైదానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 2010లో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ 153 పరుగుల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత కొన్నేళ్లుగా ఇండోర్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
ప్రాక్టీసులో భారత ఆటగాళ్లు..
Gearing 🆙 in Gwalior with radiant rhythm and full flow 👌👌 #TeamIndia hone their fielding skills ahead of the #INDvBAN T20I series opener 🙌@IDFCFIRSTBank pic.twitter.com/RjbUb7scXe
— BCCI (@BCCI) October 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..