IND vs BAN 1st Test Day 1: అశ్విన్, జడ్డూల ఊచకోత.. భారీ స్కోర్ దిశగా భారత్.. తొలిరోజు రికార్డులు ఇవే..

|

Sep 19, 2024 | 5:22 PM

India vs Bangladesh, 1st Test: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి చెన్నై టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో జట్టు 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో కూరుకపోయింది. కానీ ఇక్కడ నుంచి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 195 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

IND vs BAN 1st Test Day 1: అశ్విన్, జడ్డూల ఊచకోత.. భారీ స్కోర్ దిశగా భారత్.. తొలిరోజు రికార్డులు ఇవే..
Ind Vs Ban 1st Test Ashwin And Jadeja
Follow us on

India vs Bangladesh, 1st Test: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి చెన్నై టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో జట్టు 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో కూరుకపోయింది. కానీ ఇక్కడ నుంచి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 195 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సొంతగడ్డపై అశ్విన్ సెంచరీ చేయగా, జడేజా 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

తొలి రోజు భారత్ తరపున యశస్వి జైస్వాల్ 56 పరుగులు, రిషబ్ పంత్ 39 పరుగులు, కేఎల్ రాహుల్ 16 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ చెరో 6 పరుగులు చేసి ఔట్ కాగా, శుభమాన్ గిల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. బంగ్లాదేశ్‌లో హసన్ మహమూద్ 4 వికెట్లు తీశాడు. మెహదీ హసన్ మిరాజ్, నహిద్ రానా తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆట రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..