Ind vs Aus: 7 టెస్టుల్లో 624 పరుగులు.. అత్యధిక సగటుతో ఆసీస్‌ను చితక్కొట్టాడు.. కట్‌చేస్తే.. భారత జట్టును నుంచి ఔట్‌..

|

Feb 06, 2023 | 3:02 PM

భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి జరగనుంది. అయితే, ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక సగటు ఉన్న ఆటగాడు ఆడడం లేదు.

Ind vs Aus: 7 టెస్టుల్లో 624 పరుగులు.. అత్యధిక సగటుతో ఆసీస్‌ను చితక్కొట్టాడు.. కట్‌చేస్తే.. భారత జట్టును నుంచి ఔట్‌..
Ind Vs Aus Pant
Follow us on

భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి జరగనుంది. అయితే, ప్రస్తుత టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక సగటు ఉన్న ఆటగాడు ఆడడం లేదు. అంటే అతని గైర్హాజరు టీమిండియాకు భారీ దెబ్బగా మారనుంది. అయితే ముందుగా ఆ భారత ఆటగాడు ఎవరు, ఎందుకు ఆడడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న రిషబ్ పంత్ గురించే మాట్లాడుతున్నాం.

ఆసుపత్రిలో చేరిన రిషబ్ పంత్ ప్రపంచ క్రికెట్‌లోని ప్రస్తుత టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ సగటును కలిగి ఉన్నాడు. ఆస్ట్రేలియాపై అతని బ్యాటింగ్ సగటు 62 కంటే ఎక్కువగా ఉంది.

భారీ సిరీస్‌లలో కీలక ఆటగాడిగా రిషబ్ పంత్..

ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న సిరీస్ చాలా కీలకమైనది. కానీ, ఈ జట్టు నుంచి రిషబ పంత్ ఔటయ్యాడు. ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా పంత్ ఎందుకు అత్యంత ప్రమాదకరం అని అతని గణాంకాలను చూసి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రిషబ్ పంత్ ఆస్ట్రేలియాతో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం12 ఇన్నింగ్స్‌ల్లో 62.40 సగటుతో 624 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 2 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ 72.13గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత టెస్టు బ్యాట్స్‌మెన్‌లలో అత్యధిక సగటు..

ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై పంత్‌కు అత్యధిక సగటు ఉంది. అతను 56.50 సగటుతో స్కోర్ చేసిన క్రికెటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ కూడా ఇదే సగటుతో ఆస్ట్రేలియాపై పరుగులు సాధించాడు. అదే సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఇమామ్-ఉల్-హక్ 55.11 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్ సగటు 54.08తో పుజారా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో కనీసం 5 టెస్టులు ఆడిన ప్లేయర్ల బ్యాటింగ్ సగటు ఇదే.

పంత్ స్థానంలో ఎవరు?

ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు టీమిండియా దూరమైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ కారణంగా అతను చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాబట్టి అతని పునరాగమనం గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కానీ, జట్టులో అతని స్థానాన్ని ఎవరు పొందనున్నారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు మేనేజ్‌మెంట్ ముందు పంత్‌కు ప్రత్యామ్నాయంగా అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ లేదా కేఎస్ భరత్‌ ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ ఎవరు అవుతారో చూడాలి?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..