IND vs AUS: భారత్‌ జట్టుకు గుడ్‌న్యూస్.. పెర్త్ టెస్టుకు ముందే జట్టుతో చేరనున్న డేంజరస్ ఓపెనర్?

|

Nov 18, 2024 | 1:15 PM

IND vs AUS: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడడంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఇటీవలే తండ్రి అయిన రోహిత్.. తన సెలవులు ముగించుకుని ఆస్ట్రేయాలికు పంపనున్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను కొంచెం ఆలస్యంగా భారత జట్టులో భాగం అవ్వనున్నాడు.

IND vs AUS: భారత్‌ జట్టుకు గుడ్‌న్యూస్.. పెర్త్ టెస్టుకు ముందే జట్టుతో చేరనున్న డేంజరస్ ఓపెనర్?
Ind Vs Aus 1st test
Follow us on

IND vs AUS: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్‌లో టెస్ట్ సిరీస్‌కు ఆడడంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఇటీవలే రోహిత్ తండ్రైన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో, అతను కొంచెం ఆలస్యంగా భారత జట్టులో భాగం అవ్వనున్నాడు. తాజా సమాచారం ప్రకారం పెర్త్‌ టెస్టు సందర్భంగా రోహిత్‌ శర్మ భారత జట్టులో చేరనున్నాడు. అయితే, తొలి టెస్టులో ఆడలేడు. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టుకు అతను అందుబాటులో ఉంటాడు. అతని నిష్క్రమణపై అధికారిక ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుంది. రోహిత్ గైర్హాజరీతో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీని చేపట్టనున్నాడు.

ఓ సమాచారం ప్రకారం, పెర్త్ టెస్ట్ సమయంలో కూడా రోహిత్ భారత జట్టులో భాగం కాగలడు. ఈ టెస్టు మధ్యలో అతడు ఆస్ట్రేలియా వెళ్లవచ్చు. ఇది జరగకపోతే అడిలైడ్ టెస్టు నుంచి టీమిండియాతో కలిసి ఉంటాడు. నవంబర్ 15న రోహిత్ రెండోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రితికా సజ్దే ఒక కొడుకుకు జన్మనిచ్చింది. రోహిత్ తన పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటికే బీసీసీఐ నుంచి పితృత్వ సెలవు తీసుకున్నాడు. దీంతో తొలి టెస్టులో ఆడడం అతనికి కష్టమైంది. తన కుటుంబంతో కొంత సమయం గడపాలని అనుకుంటున్నాడని, అందుకే తొలి టెస్టులో ఆడలేనని చెబుతున్నారు.

రోహిత్ లేకపోవడంతో ఓపెనింగ్ జోడీలో మార్పు..

పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు కొత్త ఓపెనింగ్ జోడీని తయారు చేయవలసి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, యశస్వి జైస్వాల్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయడానికి కెఎల్ రాహుల్‌ను పంపవచ్చు. అయితే, సమస్య ఏమిటంటే, వేలి గాయం కారణంగా శుభ్‌మన్ గిల్‌ ఆడటం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితిలో, టీమ్ మేనేజ్‌మెంట్ మూడో నంబర్‌లోనూ బ్యాట్స్‌మన్‌ను కనుగొనవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇండియా ఎతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన దేవదత్ పడిక్కల్‌ను బ్యాకప్‌గా ఉంచారు. అతను ఇండియా ఏ తరపున 36, 88, 26, 1 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో అతను జస్ప్రీత్ బుమ్రాపై బ్యాటింగ్ చేసిన విధానం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో దేవదత్ అరంగేట్రం చేశాడు. తర్వాత నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ 65 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..