ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లోని నాల్గవ మ్యాచ్ అంటే అహ్మదాబాద్‌లో ఇషాన్ కిషన్ అరంగేట్రం గురించి చాలా ఊహాగానాలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. వికెట్ కీపర్ కేఎస్ భరత్‌తో కలిసి మ్యాచ్‌లోకి దిగడం సరైనదని టీమిండియా, కెప్టెన్ రోహిత్ శర్మ భావించాడు. అయితే రోహిత్ శర్మతో ఇషాన్ కిషన్ చేసిన ఓ పనితో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాడు.
ఆటగాళ్లకు వాటర్ అందించే బాధ్యతను ఇషాన్ కిషన్‌కు అందించారు. ఈమేరకు అతను మ్యాచ్ సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఆటగాళ్లకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఇషాన్ భారత సారథి రోహిత్ చేతి నుంచి బాటిల్ తీసుకుని బయటకు పరుగెత్తేందుకు ట్రే చేశాడు. ఈ క్రమంలో అతడి చేతిలో నుంచి బాటిల్ కిందపడింది. దీంతో రోహిత్ స్పందించి, చేతితో ఇషాన్‌ను కొట్టబోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, నెటిజన్లు మాత్రం ఫన్నీతో పాటు సీరియస్‌గా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఎందుకంత దూకుడు, జూనియర్లపై ప్రతాపం చూపిస్తున్నాడంటూ కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం.. ఫన్నీగా కొట్టబోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
Indian Captain Rohit Sharma’s bad behaviour with junior Ishan Kishan #RohitSharma #vadapav #ishankishan #DCvsMI #MumbaiIndians #DelhiCapitals #NarendraModiStadium #Shami #viratkholi #BorderGavaskarTrophy pic.twitter.com/utC0PfUR48
— ADITYA RAJPUT (@adityar4jput) March 9, 2023
ఇషాన్ కిషన్ టెస్ట్ అరంగేట్రం గురించి మాట్లాడితే, అహ్మదాబాద్ మ్యాచ్ ప్రారంభానికి ముందు, చాలా మంది క్రికెట్ నిపుణులు ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్‌ను సిరీస్‌లోని చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని భావించారు. కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని అన్నారు. ఎందుకంటే భరత్ మొదటి మూడు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాడు. అలాగే కొన్ని వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు.
నాల్గవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభంలో కూడా భరత్ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ అందించిన ఒక సాధారణ క్యాచ్‌ను వదిలిపెట్టాడు. ఆ తర్వాత అభిమానులు అతనిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే, అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్‌కు ముందు ఇషాన్ కిషన్ అరంగేట్రం గురించి కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించగా.. ఇషాన్ అవకాశం దొరికినప్పుడు ఆడతాడంటూ చెప్పుకొచ్చాడు. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చి కూర్చోబెట్టడం జరగదు. అది సరిగ్గా ఉండదు అంటూ భరత్ గురించి చెప్పుకొచ్చాడు.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 392 బంతుల్లో 165 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కెమెరాన్ గ్రీన్ 114 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..