AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final, IND vs AUS: మ్యాచ్‌కు ముందే హాఫ్ సెంచరీలు కొట్టేసిన రోహిత్, పాట్ కమ్మిన్స్.. ఎలాగంటే?

Rohit Sharma - Pat Cummins Playing 50th Test: రోహిత్ శర్మ ఈరోజు కెప్టెన్‌గా 7వ టెస్టు, పాట్ కమిన్స్ 16వ టెస్టు ఆడుతున్నారు. వీరిద్దరి కెరీర్‌లో ఇది 50వ టెస్టు కావడం గమనార్హం. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా చేసుకోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

WTC Final, IND vs AUS: మ్యాచ్‌కు ముందే హాఫ్ సెంచరీలు కొట్టేసిన రోహిత్, పాట్ కమ్మిన్స్.. ఎలాగంటే?
Wtc Final Rohit Cummins
Venkata Chari
|

Updated on: Jun 08, 2023 | 3:33 PM

Share

టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతకుముందు చాలా అరుదుగా కనిపించని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు చేసుకుంది. భారత్ , ఆస్ట్రేలియా కెప్టెన్లు కలిసి అర్ధ సెంచరీలు చేశారు. అది కూడా టాస్‌తోనే. ఇద్దరు కెప్టెన్లకు ఇది ఎలాంటి హాఫ్ సెంచరీ అని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం..

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇరు జట్ల కెప్టెన్‌లు అంటే రోహిత్ శర్మ, పాట్ కమిన్స్‌ల టెస్ట్ కెరీర్‌లో 50వ మ్యాచ్. 50 టెస్టులు ఆడడం పెద్ద విజయం. ఇప్పుడు ఈ ఇద్దరు కెప్టెన్లు WTC ఫైనల్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం ద్వారా తమ 50వ టెస్టును చిరస్మరణీయంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటివరకు రోహిత్, కమిన్స్‌ల టెస్టు రికార్డులు..

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటివరకు ఆడిన 49 టెస్టుల్లో 217 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, బ్యాటింగ్‌లో 924 పరుగులు చేశారు. మరోవైపు, రోహిత్ శర్మ 49 టెస్ట్ మ్యాచ్‌లలో 3379 పరుగులు చేశాడు. బంతితో 2 వికెట్లు తీసుకున్నాడు. రోహిత్ శర్మ 49 టెస్టు మ్యాచ్‌ల్లో 1 డబుల్ సెంచరీ, 9 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణంలో 9 శతకాలలో 6 శతకాల స్క్రిప్ట్ రాసుకోవడం గొప్ప విషయంగా చెబుతున్నారు.

రోహిత్-కమిన్స్ కెప్టెన్సీ గణాంకాలు?

అయితే 50వ టెస్టులో తమ జట్లను గెలిపించే సవాల్‌ ఇద్దరు కెప్టెన్‌ల ముందు నిలిచింది. రోహిత్ కంటే కమిన్స్‌కు ఎక్కువ అనుభవం ఉందనడంలో సందేహం లేదు. కానీ, ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్సీ వహించిన అన్ని టెస్టుల్లోనూ అతని రికార్డు పర్ఫెక్ట్‌గా నిలిచింది.

రోహిత్ శర్మ ఇప్పటివరకు 6 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో అతను 4 గెలిచాడు. ఒకటి ఓడిపోయాడు. ఒక మ్యాచ్ డ్రా అయింది. మరోవైపు, పాట్ కమిన్స్ ఇప్పటివరకు 15 టెస్టులకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 8 గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 4 మ్యాచ్‌లు డ్రాగా నిలిచాయి.

ఓవల్‌లో రోహిత్ సెంచరీ..

రోహిత్ శర్మ రికార్డు అద్భుతంగా ఉన్న ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం గొప్ప విషయం. ఈ మైదానంలో ఆడిన చివరి టెస్టులో రోహిత్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్‌పై రోహిత్ 127 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే పనితీరును పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు, తొలిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా కెప్టెన్ కూడా ఇక్కడ టైటిల్ విజయంతో ఇంగ్లండ్‌పై యాషెస్ పోరులో అడుగుపెట్టాలనుకుంటున్నాడు.

జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.