Sanju Samson: అహ్మదాబాద్ టెస్టు ముగిసిన వెంటనే ‘గాయపడిన’ శ్రేయాస్ అయ్యర్ స్థానాన్ని ఖరారు చేసేందుకు బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నారు. క్రిక్‌బజ్ ప్రకారం, శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సందేహాస్పదంగా ఉన్నాడు. నడుము నొప్పి కారణంగా అయ్యర్ చివరి టెస్టులో 4వ రోజు బ్యాటింగ్‌కు రాలేదు. అతడిని స్కానింగ్ కోసం తీసుకెళ్లగా రిపోర్టులు సంతృప్తికరంగా లేవని తేలింది. దీంతో అయ్యర్ స్థానంలో సంజూ శాంసన్ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ కోసం తొలి వన్డే జట్టులో శాంసన్‌ను ఎంపిక చేయలేదు. ఇక ప్రస్తుతం అయ్యర్ స్థానంలో శాంసన్‌ను ఎంపిక చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
“మూడో రోజు ఆట తర్వాత శ్రేయాస్ అయ్యర్ తన వెన్నుముకలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశాడు. స్కానింగ్ కోసం వెళ్ళాడు. BCCI వైద్య బృందం అతనిని పర్యవేక్షిస్తోంది” అని ఆదివారం ఉదయం బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. భారత్‌కు విజయం సాధించాలంటే 10 వికెట్లు పడగొట్టాలి. అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నందున ఫలితం డ్రాగా మారనుందని తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా చేయాల్సిందల్లా 90 ఓవర్ల వరకు ఆలౌట్ కాకుండా ఆడడమే.
నాలుగో రోజు ఆఖరి సెషన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి మూడున్నర సంవత్సరాల తర్వాత కోహ్లీ మొదటి టెస్ట్ సెంచరీ చేశాడు. 364 బంతుల్లో (15×4) 186 పరుగుల వద్ద అవుట్ అయ్యి భారత్‌కు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. గాయపడిన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కోహ్లీతో కలిసి 162 పరుగుల భాగస్వామ్యంలో అక్షర్ పటేల్ 113 బంతుల్లో (5×4, 4×6) 79 పరుగులు చేశాడు. ప్రస్తుతం వార్తలు రాసే సమయానికి ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసి, డ్రా కోసం కష్టపడుతోంది.
సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా 480 & 3/0; భారత్ 571 ఆలౌట్ (విరాట్ కోహ్లీ 186, శుభ్‌మన్ గిల్ 128, అక్షర్ పటేల్ 79; టాడ్ మర్ఫీ 3/113, నాథన్ లియాన్ 3/151).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..