భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అంపైర్లను ఖరారు చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC). జూన్ 7-11ల తేదీల మధ్య ఓవల్ వేదికగా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా నియమితులయ్యారు. అలాగే ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో టీవీ అంపైర్‌గా ఎంపికకగా, శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన నాలుగో అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఇక మ్యాచ్ రిఫరీగా వెస్టిండీస్‌కు చెందిన రిచీ రిచర్డ్‌సన్ ఎంపికయ్యారు. కాగా ఈ అంపైర్ల పేర్లు వింటేనే టీమిండియాలో వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకంటే ఈ అంపైర్ల ప్యానల్ వ్యవహరించిన ఐసీసీ ప్రధాన ఈవెంట్లన్నింటిలోనూ టీమ్ ఇండియా ఓడిపోయింది. ఇప్పుడిదే టీమిండియాతో పాటు అభిమానులను కంగారు పెడుతోంది. 48 ఏళ్ల క్రిస్ గాఫ్నీ తన కెరీర్‌లో 49వ టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్ చేయనుండగా, 59 ఏళ్ల ఇల్లింగ్‌వర్త్ 64వ టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్ చేయనున్నారు.
ఇక టీమ్ ఇండియా గురించి విషయానికొస్తే.. గత 6 ఏళ్లలో మూడోసారి ICC టోర్నమెంట్ ఫైనల్ ఆడనుంది. ఇంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత చివరిసారి టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో ఆడి ఓడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఐసీసీ ఈవెంట్‌లోనూ టీమిండియా ఫైనల్ ఆడలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్లు, టీవీ అంపైర్లుగా పనిచేస్తున్న ముగ్గురు అంపైర్లు గత 6 సంవత్సరాలలో భారతదేశం ఆడిన అన్ని నాకౌట్ మ్యాచ్‌లకు అంపైర్లుగా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ నాకౌట్ మ్యాచ్‌లన్నింటిలో టీమిండియా ఓడిపోయింది.
ముఖ్యంగా రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా వ్యవహరించిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, అలాగే 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచుల్లో భారత జట్టు ఓడిపోయింది. అలాగే గత టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ కెటిల్ బరో టీవీ అంపైర్‌గా ఉన్నాడు. ఈ మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది. అలాగే రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2019 సెమీ-ఫైనల్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నారు. అదేవిధంగా 2022 T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో క్రిస్ గాఫ్నీ టీవీ అంపైర్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కుమార్ ధర్మసేన ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు. అయితే జట్టు గెలుపోటములు అంపైరింగ్‌పై ఆధారపడవు. మైదానంలో ప్రదర్శనే ఇరు జట్ల గెలుపోటములను నిర్ణయిస్తుంది. మరి కనీసం ఈసారి అయినా టీమిండియా ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి.
ICC announces match officials for WTC final
?Chris Gaffaney and Richard Illingworth will officiate as the on-field umpires for the summit clash at The Oval from June 7.
?https://t.co/Jg1qM2EqYu#WTCFinal | #TeamIndia | #Australia pic.twitter.com/vKD55rCasq
— Cricket.com (@weRcricket) May 29, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..