IND vs AUS: ఫార్మాట్ ఏదైనా.. ట్రోఫీ దక్కాల్సిందే.. తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన ఆసీస్..

|

Jun 11, 2023 | 9:50 PM

WTC 2023 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో అన్ని ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్స్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.

IND vs AUS: ఫార్మాట్ ఏదైనా.. ట్రోఫీ దక్కాల్సిందే.. తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన ఆసీస్..
Australia Wtc Final 2023
Follow us on

ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయం చారిత్రాత్మకం. అన్ని ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్స్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌ను 5 సార్లు గెలుచుకుంది. ఈ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్, ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకుంది. ఈసారి జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

ఐసీసీ టైటిల్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గణాంకాలు..

5 సార్లు వన్డే ప్రపంచకప్

ఇవి కూడా చదవండి

2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ

టీ20 ప్రపంచకప్ ఒకసారి

తాజాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్

ఆస్ట్రేలియా తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా జట్టు 5 సార్లు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 1987, 1999, 2003, 2007, 2015లో టైటిల్ గెలుచుకుంది. దీంతో పాటు రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2006, 2009లో కంగారూ జట్టు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో అన్ని పార్మాట్లలో ఐసీసీ టైటిల్స్‌ను గెలుచుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..