IND vs AUS: డాక్యుమెంటరీగా ఆ చరిత్రాత్మక సిరీస్‌.. ట్రైలర్‌ రిలీజ్ చేసిన భారత క్రికెటర్లు

Team India: ఇంతటి చరిత్రాత్మక సిరీస్‌ను డాక్యుమెంటరీ రూపంలో మరోసారి చూసేందుకు అవకాశం ఉంది. బాలీవుడ్‌ డైరెక్టర్ నీరజ్‌ పాండే ఈ డాక్యుమెంటరీని ‘బంధన్‌ మే తా ధమ్‌’ పేరుతో సిద్ధం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను టీమిండియా ఆటగాళ్లు బుధవారం రిలీజ్ చేశారు.

IND vs AUS: డాక్యుమెంటరీగా ఆ చరిత్రాత్మక సిరీస్‌.. ట్రైలర్‌ రిలీజ్ చేసిన భారత క్రికెటర్లు
Team India Ind Vs Aus

Updated on: Jun 03, 2022 | 7:40 AM

Border Gavaskar Trophy: ప్రపంచ క్రికెట్‌లో ప్రతి సంవత్సరం ఎన్నో సిరీస్‌లు జరుగుతుంటాయి. ఇందులో కొన్ని సిరీస్‌లు అస్సలు గుర్తుండవు. అయితే, కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. కాగా, భారత క్రికెట్ చరిత్రలో కూడా ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఇలాంటి ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి మాట్లాడితే, 2020-21లో భారత్‌ వర్సెస్ ఆసీస్‌ మధ్య జరిగిన సిరీస్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీగా పేరుగాంచిన ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో విజయం సాధించి, ట్రోఫిని దక్కించుకుంది.

ఇంతటి చరిత్రాత్మక సిరీస్‌ను డాక్యుమెంటరీ రూపంలో మరోసారి చూసేందుకు అవకాశం ఉంది. బాలీవుడ్‌ డైరెక్టర్ నీరజ్‌ పాండే ఈ డాక్యుమెంటరీని ‘బంధన్‌ మే తా ధమ్‌’ పేరుతో సిద్ధం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను టీమిండియా ఆటగాళ్లు బుధవారం రిలీజ్ చేశారు. హనుమ విహారి, మహ్మద్‌ సిరాజ్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే, రవిచంద్రన్‌ అశ్విన్‌ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆనాటి సిరీస్‌లో జరిగిన కొన్ని సంఘటనలను ఇందులో చేర్చారు. అలాగే రహానే, సిరాజ్‌లు ఆనాటి విశేషాలను ఈ ట్రైలర్‌లో పంచుకున్నాడు. ఈ డాక్యుమెంటరీ ఓటీటీ ఫ్లాట్‌పామ్ వూట్ సెలక్ట్‌లో జూన్‌ 16 నుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..