సిడ్నీలో జరుగుతోన్న 5వ టెస్ట్ మూడో రోజున భారత జట్టు గులాబీ రంగులో కనిపిస్తోంది. అందుకు ఓ కారణం కూడా ఉంది. తొలి రోజు నుంచి కేవలం ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఇలా కనిపించగా.. మూడో రోజు భారత ఆటగాళ్లు కూడా ఇలాగే కనిపించారు. గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ గౌరవార్థం మూడో రోజున భారత ఆటగాళ్లు పింక్ డ్రెస్‌లతో కనిపించారు.
మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు భారత జట్టు సంతకం చేసిన క్యాప్‌లను అందించింది. మెక్‌గ్రాత్ ఫౌండేషన్ కోసం డబ్బును సేకరించడానికి సిడ్నీ టెస్ట్ మూడవ రోజును పింక్ డే అని పిలుస్తుంటారు. ఇందుకోసమే భారత ఆటగాళ్లు కూడా గులాబీ రంగులో కనిపించారు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో కొత్త ఏడాదిలో నిర్వహించే తొలి టెస్టును కూడా ‘పింక్ టెస్ట్’ అని పిలుస్తుంటారు. మ్యాచ్ సమయంలో, స్టాండ్‌లు, వేదిక చుట్టూ ఉన్న సూచికలు, స్టంప్‌లు కూడా గులాబీ రంగులో ఉంటాయి.
The SCG has turned pink in honor of Jane McGrath! 🩷
A special day dedicated to raising awareness and funds for breast cancer, with players taking the field in pink caps 👏
#GlennMcGrath #AUSvIND #Sydney #INDvsAUS pic.twitter.com/OF2Apa1o4j
— Satya_vk (@satyavk15) January 4, 2025
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం. గ్లెన్ తన భార్య జేన్‌ను ఇదే వ్యాధితో కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2005లో మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. రొమ్ము క్యాన్సర్ రోగులు, ప్రాణాలతో బయటపడిన వారికోసం అలాగే ఈ వ్యాధిపై అవగాహనతో, నిధులను సేకరించేందుకు ఈ ఫౌండేషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా సహకరిస్తుంది. ఈ క్రమంలో మూడో రోజు భారత జట్టు గులాబీ రంగులో కనిపించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..