IND vs AUS: ఇట్స్ బ్రేక్ టైమ్..! ఆసీస్ బ్యాటర్ల ముందు కోహ్లీ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

|

Sep 27, 2023 | 6:30 PM

IND vs AUS 3rd ODI: రాజ్‌కోట్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరుగుతుండగా.. ఆసీస్ బ్యాటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తొలి రెండు వన్డేల నుంచి విశ్రాంతి తీసుకుని.. మూడో మ్యాచ్‌ ఆడేందుకు జట్టులోకి తిరిగి వచ్చిన కోహ్లీకి సంబంధించిన వీడియో అది. సందర్భం ఏదైనా మైదానంలో చాలా చురుగ్గా ఉండే కోహ్లీ.. కంగారుల ముందు డ్యాన్స్..

IND vs AUS: ఇట్స్ బ్రేక్ టైమ్..! ఆసీస్ బ్యాటర్ల ముందు కోహ్లీ డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో..
India Vs Australia
Follow us on

IND vs AUS 3rd ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్‌ 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా తరఫున టాప్ ఆర్డర్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (56), మిచెల్ స్టార్క్ (96), స్టీవ్ స్మిత్ (74), మార్నస్ లబుషేన్ (72) అర్థసెంచరీలు చేశారు. ఇలా ఆసీస్ ఇచ్చిన 253 పరుగుల టార్గెట్‌ని చేధించేందుకు టీమిండియా బరిలోకి దిగింది. అయితే ఆసీస్ బ్యాటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తొలి రెండు వన్డేల నుంచి విశ్రాంతి తీసుకుని.. మూడో మ్యాచ్‌ ఆడేందుకు జట్టులోకి తిరిగి వచ్చిన కోహ్లీకి సంబంధించిన వీడియో అది. సందర్భం ఏదైనా మైదానంలో చాలా చురుగ్గా ఉండే కోహ్లీ.. కంగారుల ముందు డ్యాన్స్ వేశాడు.

అసలేం జరగిందంటే.. 28వ ఓవర్ చివరి బంతికి మిచెల్ మార్ష్ ఔట్ అయిన వెంటనే మైదానంలోకి మార్నస్ లాబుషెన్‌తో పాటు ఓ కుర్చీ కూడా వచ్చింది. చాలా సేపటి నుంచి ఎండలోనే బ్యాటింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ కుర్చీ. ఇక దానిపై కూర్చుని స్మిత్ డ్రింక్ తాగుతూ విశ్రాంతి తీసుకుంటుండగా.. కోహ్లీ అక్కడకు వచ్చాడు. అక్కడే నిలిబడి ఉన్న లబుషెన్‌ను ఆటపట్టిస్తున్నట్లుగా నడుము ఊపాడు. ఆ తర్వాత వారిద్దరూ ఏదో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను జియో సినిమా పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో స్పందిస్తున్నారు.

కాగా, ఆసీస్ విధించిన టార్గెట్‌ని చేధించేందుకు రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చారు. 7 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి భారత్ 50 పరుగులు చేయగా.. ఇందులో రోహిత్ 40*, వాషింగ్టన్ సుందర్ 10* రన్స్ చేశారు. ఇదిలా ఉండగా.. వన్డే వరల్డ్ కప్ 2023 ముందు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ సిరీస్‌ను రోహిత్ సేన 2-0 తేడాతో ముందుగానే గెలుచుకుంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్‌లో కూడా గెలిచి ఆసీస్‌ని వైట్ వాష్ చేయాలనే యోచనలో రోహిత్ సేన ఉంది.

మూడో వన్డేలో తుది జట్లు:

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంగా, జోష్ హేజిల్‌వుడ్‌.