IND vs AUS: వైజాగ్‌లో ఆస్ట్రేలియాకు మరో ఓటమి పక్కా.. టీమిండియా రికార్డులు చూస్తే ‘కంగారు’పడాల్సిందే..
IND vs AUS 2nd ODI: విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. ఇక్కడ టీమిండియాదే పైచేయిగా నిలిచింది.
Dr. Y.S. Rajasekhara Reddy Cricket Stadium Stats: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ మార్చి 19, ఆదివారం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు మొత్తం 9 వన్డేలు జరిగాయి. ఈ క్రమంలో ఈ స్టేడియానికి సంబంధించిన కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 9 వన్డే మ్యాచ్‌లు జరిగాయి.
2005లో ఈ మైదానంలో తొలి వన్డే మ్యాచ్ జరిగింది. కాగా, చివరి మ్యాచ్ 2019లో జరిగింది.
ఇక్కడ ఆతిథ్య జట్టు అంటే టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడి 7 గెలిచింది. ఒకదానిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది.
ఈ మైదానంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 5 మ్యాచ్‌లు గెలవగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మొత్తం 3 మ్యాచ్‌లు గెలిచింది.