IND vs AFG 3rd T20I: సిరీస్ గెలిచాం, ఇక ఫైనల్ మ్యాచ్‌లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులు..!
India vs Afghanistan 3rd T20I: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో గెలుచుకున్న భారత్, మూడో టీ20లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూచనల మేరకు బెంచ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నారు. వైభవ్ సూర్యవంశి, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

India vs Afghanistan 3rd T20I: శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలోని భారత జట్టు ఆఫ్ఘానిస్తాన్ పై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో టీ20 సిరీస్ గెలుచుకుంది. రెండు మ్యాచ్ ల్లోనూ 7 వికెట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం. అయితే, తొలి టీ20లో విఫలమైన సంజూ శాంసన్ రెండో మ్యాచ్ లో 22 బంతుల్లోనే 57 పరుగులతో డేంజరస్ ఇన్నింగ్స్ ఆడాడు. కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ 39 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బౌలింగ్ లోనూ భారత్ అదరగొట్టింది. తెలుగుబ్బాయ్ నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లతో అలరించాడు. మొత్తంగా భారత జట్టు అన్ని రంగాల్లో ఆకట్టుకుంది. సిరీస్ గెలిచింది. ఈక్రమంలో ఫైనల్ మ్యాచ్ లో బెంచ్ లో ఉన్న ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది.
మూడో టీ20 మ్యాచ్ రేపు (17వ తేదీన) అదే అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు కీలక మార్పులతో బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తోంది. 2వ టీ20 మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశాడు. దీనికి తగ్గట్టుగానే టాప్ ఆర్డర్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ముఖ్యంగా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని మైదానంలో చూడడం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా 2 మ్యాచుల్లో అతనికి ఛాన్స్ రాలేదు. దీంతో మూడో టీ20లో అతడు తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ అతన్ని ప్లేయింగ్ ఎలెవన్‌కు సెలెక్ట్ చేస్తే, సంజు శాంసన్‌ను తప్పిస్తారా అనే సందేహం నెలకొంది. అయితే, సంజును తప్పించే అవకాశం లేదని, బదులుగా అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఇషాన్ కిషన్‌కు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.
దులీప్ ట్రోఫీతో పాటు వరుసగా రెండు టీ20లలోనూ విశ్రాంతి లేకుండా ఆడుతున్న నేపథ్యంలో, అతడి పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తదనంతరం జపాన్, ఆసియా గేమ్స్ వంటి టోర్నమెంట్లు ఉండడంతో ఇషాన్ కిషన్‌కు ఈ విశ్రాంతి అవసరం అని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీంతో మూడో టీ20లో సంజు శాంసన్ ఫస్ట్ డౌన్‌లో వచ్చి బ్యాటింగ్‌కు దిగుతాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఎక్కువమంది చదివినది: ఒకే ఓవర్లో 27 పరుగులు.. ఉతికారేసిన ఓపెనర్స్.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!
బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. అక్షర్ పటేల్‌కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వనున్నారు. అలాగే, వేగవంతమైన బౌలర్ల విభాగంలో బుమ్రా స్థానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కనుంది. మొత్తంగా, బెంచ్‌పై ఉన్న వైభవ్ సూర్యవంశీ, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు మూడో టీ20లో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పులతో టీమిండియా తమ బెంచ్ బలం, యువ ప్రతిభను పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది రాబోయే టోర్నమెంట్లకు బలమైన జట్టును నిర్మించడంలో సహాయపడుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
