AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్.. హ్యాట్రిక్ సాధించిన రోహిత్ శర్మ!

చెన్నైలో జరుగుతున్న భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో వన్డేలో టీమిండియా అద్భుతమైన ఆరంభం లభించింది. ప్రసిద్ధ్ కృష్ణ బంతితో నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చగా, రోహిత్ శర్మ స్లిప్‌లో వరుసగా మూడు క్యాచ్‌లు పట్టి అరుదైన హ్యాట్రిక్ సాధించాడు. ఆఫ్ఘన్ కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

IND vs AFG: ప్రసిద్ధ్ కృష్ణ సూపర్ బౌలింగ్.. హ్యాట్రిక్ సాధించిన రోహిత్ శర్మ!
Rohit Sharma
SN Pasha
|

Updated on: Jun 20, 2026 | 3:16 PM

Share

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అద్భుతమైన స్టార్ట్ అందుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమైన వన్డేలో టీమిండియా యంగ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న గిల్ సేన.. ఈ చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి గౌరవంగా సిరీస్ ముగించాలని పసికూన ఆఫ్ఘనిస్థాన్ భావిస్తోంది.

రోహిత్ శర్మ హ్యాట్రిక్..

అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదే రోహిత్ శర్మ హ్యాట్రిక్. వావ్.. రోహిత్ బౌలింగ్ చేసి హ్యాట్రిక్ సాధించాడా? అని ఆశ్చర్యపోకండి. రోహిత్ హ్యాట్రిక్ సాధించింది బౌలింగ్ వేసి.. క్యాచ్‌లు పట్టి. వరుసగా తొలి మూడు వికెట్లు రోహిత్ క్యాచ్ అందుకోవడంతోనే పడ్డాయి. పైగా బౌలర్ కూడా ఒక్కడే. ప్రసిద్ధ్ తీసిన తొలి మూడు వికెట్లు కూడా స్లిప్‌లో రోహిత్ క్యాచ్‌తోనే లభించాయి. ఏదో రీప్లే చూస్తున్నట్లు వరుసగా ఆ మూడు వికెట్లు దాదాపు ఒకే విధంగా పడ్డాయి. ఇలా క్యాచ్‌లతో రోహిత్ శర్మ హ్యాట్రిక్ సాధించాడు.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ప్రసిద్ధ్ రూపంలో వారికి గట్టి షాక్ తగిలింది. కేవలం 36 పరుగులకే ఆఫ్ఘాన్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ నాలుగు కూడా ప్రసిద్ధ్ కృష్ణకే దక్కాయి. తొలి వన్డేలో సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్ 5, మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 11, రెహమత్ షా 5, డార్విష్ రసూలీ ఒక్క పరుగుల చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కెప్టెన్ షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆఫ్ఘాన్ 99 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!