
Rishabh Pant Century: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో 3వ రోజు రిషబ్ పంత్ సెంచరీతో అలరించాడు. టెస్ట్ కెరీర్‌లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు. కాగా, పంత్ 124 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ చేశాడు.
డిసెంబరు 2022లో జరిగిన ఘోరమైన కారు ప్రమాదం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పంత్.. టెస్ట్ క్రికెట్‌కి తిరిగి వచ్చి ఈ విశేషమైన ఫీట్‌ను నెలకొల్పాడు.
ఈ సంవత్సరం ప్రారంభంలో, పంత్ 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమయంలో ప్రొఫెషనల్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. అక్కడ అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికయ్యే ముందు దులీప్ ట్రోఫీ ద్వారా పంత్ రెడ్-బాల్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు.
రిషబ్ పంత్ – 6
ఎంఎస్ ధోని – 6
వృద్ధిమాన్ సాహా – 3
Trademark sixes, excellent strokes, and a memorable return 👌👌
📽️ Recap Rishabh Pant’s 6th Test Hundred 💯#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) September 21, 2024
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (AUS) – 17
ఆండీ ఫ్లవర్ (ZIM) – 12
లెస్ అమెస్ (ENG) – 8
ఏబీ డివిలియర్స్ (SA) – 7
ఎంజే ప్రియర్ (ENG) – 7
కుమార్ సంగక్కర (SL) – 7
బీజే వాట్లింగ్ (ENG) – 7
క్వింటన్ డి కాక్ (SA) – 6
ఎంఎస్ ధోని (IND) – 6
కమ్రాన్ అక్మల్ (PAK) – 6
ముష్ఫికర్ రహీమ్ (BAN) – 6
ఏజే స్టీవర్ట్ (ENG) – 6
రిషబ్ పంత్ (IND) – 6
ప్రస్తుతం వార్తలు రాసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టపోయి 68 పరుగులు చేసింది. అయితే, ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం నల్లేరుపై నడకనే చెప్పాలి.