ప్చ్.. భారత మహిళల జట్టుకు మరో ఓటమి.. ఈసారి గెలుపు తీరానికి వచ్చి అమ్మాయిలు బోల్తా పడ్డారు. కేవలం 3 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయారు. అలాగే సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించారు. ముంబై వేదికగా శనివారం (డిసెంబర్ 30) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ పరుగుల వేటలో టీమిండియా విఫలమైంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ 96 పరుగులతో చెలరేగినా 3 పరుగుల దూరంలో భారత్ విజయం ఆగిపోయింది. తాజా గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకుంది.
259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు యస్తికా భాటియా, స్మృతి మంధాన శుభారంభం అందించలేకపోయారు. స్కోరు 37 పరుగుల వద్ద భాటియా (14) కిమ్ గార్త్ దెబ్బకు పెవిలియన్ చేరింది. మంధాన కూడా 34 పరుగులకు నిష్ర్కమించింది. ఆ తర్వాత రిచా, జెమిమా రోడ్రిగ్స్ ఇద్దరూ కలిసి సి 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను ఆదుకున్నారు. అయితే 44 పరుగులు చేసిన జెమీమాను ఔట్ చేసి జార్జియా ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఐదు పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చింది. దీప్తి, రిచా ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. దీప్తి తొలి బంతికే ఫోర్ కొట్టి జట్టు ఆశలు రేపినా ఆ తర్వాతి కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
స్మృతి మంధాన, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, రిచా ఘోష్ (W), స్నేహ రాణా, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్
అలిస్సా హీలీ (W/C), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లే గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్, అలనా కింగ్, కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్.
Determination. Grit. Belief 🫡@13richaghosh came out all guns blazing & nearly powered #TeamIndia to victory with a stunning 96 👏👏#INDvAUS | @IDFCFIRSTBank
Sit back and relive Richa Ghosh’s resilient knock 🎥🔽https://t.co/MmwB7m0buz
— BCCI Women (@BCCIWomen) December 30, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..