తాహిర్ ఖాతాలో అరుదైన రికార్డు!

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌తో సఫారీల వరల్డ్‌కప్ వేట ముగిసింది. అయితే ఆ జట్టు బౌలర్ ఇమ్రాన్ తాహిర్ మాత్రం అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున వరల్డ్‌కప్ మెగా టోర్నీలో అత్యధిక(39) వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో అలెన్ డోనాల్డ్(38) పేరిట ఉన్న ఈ రికార్డును తాహిర్ బద్దలు కొట్టాడు. […]

తాహిర్ ఖాతాలో అరుదైన రికార్డు!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2019 | 10:17 AM

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌తో సఫారీల వరల్డ్‌కప్ వేట ముగిసింది. అయితే ఆ జట్టు బౌలర్ ఇమ్రాన్ తాహిర్ మాత్రం అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున వరల్డ్‌కప్ మెగా టోర్నీలో అత్యధిక(39) వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో అలెన్ డోనాల్డ్(38) పేరిట ఉన్న ఈ రికార్డును తాహిర్ బద్దలు కొట్టాడు. ఇకపోతే వరల్డ్‌కప్ అనంతరం వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తానని గతంలోనే తాహిర్ మీడియాకు వెల్లడించాడు.