కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి…
వరల్డ్‌కప్ తర్వాత విండీస్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఆగష్టు 3 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ ప్రారంభం కానున్న మూడు టీ20లు, మూడు వన్డేలకు కోహ్లీ, బుమ్రా దూరమవుతారు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి విరామం లేకుండా ఆడుతున్న వీరిద్దరిపైనా ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగష్టు 22 నుంచి మొదలయ్యే టెస్ట్ […]
వరల్డ్‌కప్ తర్వాత విండీస్‌తో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఆగష్టు 3 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ ప్రారంభం కానున్న మూడు టీ20లు, మూడు వన్డేలకు కోహ్లీ, బుమ్రా దూరమవుతారు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి విరామం లేకుండా ఆడుతున్న వీరిద్దరిపైనా ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆగష్టు 22 నుంచి మొదలయ్యే టెస్ట్ సిరీస్‌కు మళ్ళీ వీరిద్దరూ జట్టులోకి తిరిగి చేరనున్నారు.
మరోవైపు ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటివరకు నాలుగు విజయాలు సాధిస్తే.. ఆ విజయాలన్నింటిలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.