IND Vs SA: ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. టీమిండియాకు భారీ నష్టమే.! కారణమిదే.?

మరికొద్ది గంటల్లో.. టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌. టైటిల్ ఫైట్‌లో గెలిచి చరిత్ర తిరగ రాయాలన్న కసితో ఉంది టీమిండియా. అటు సఫారీలు మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌ కప్ గెలిచి రికార్డ్ క్రియేట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఫైనల్‌గా.. పొట్టి పోరు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

IND Vs SA: ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. టీమిండియాకు భారీ నష్టమే.! కారణమిదే.?
Ind Vs Sa
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 29, 2024 | 12:49 PM

మరికొద్ది గంటల్లో.. టీ20 వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌. టైటిల్ ఫైట్‌లో గెలిచి చరిత్ర తిరగ రాయాలన్న కసితో ఉంది టీమిండియా. అటు సఫారీలు మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌ కప్ గెలిచి రికార్డ్ క్రియేట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఫైనల్‌గా.. పొట్టి పోరు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బర్బాడోస్ వేదికగా ఇవాళ టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్ ఫైట్​టీమిండియా-సౌతాఫ్రికా మధ్య జరగనుంది. టైటిల్‌కి ఒక్క అడుగు దూరంలో ఉన్న ఇరుజట్లు ఛాంపియన్‌గా నిలవాలని తహతహలాడుతున్నాయి. సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలిచి దాదాపు 26ఏళ్లయింది. చివరిసారి 1998 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్​ గెలిచింది. ఇటు టీమిండియా 11ఏళ్ల నుంచి ఐసీసీ ఈవెంట్‌లో విజేతగా నిలవాలని ఎదురుచూస్తోంది.

టీమిండియా – సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్‌కి చేరుకున్నాయి. గ్రూప్ దశలో టీమిండియా 3 మ్యాచ్ లు గెలిస్తే వర్షం కారణంగా కెనడాతో మ్యాచ్ రద్దయింది. సూపర్ 8 లో బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాలపై గెలిచిన రోహిత్ సేన అదే ఊపులో సెమీస్‌లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. అటు సౌతాఫ్రికా గ్రూప్ దశలో 4 విజయాలతో టాప్‌లో నిలిచింది. సూపర్ 8లో అదే జోరు కొనసాగించిన సఫారీలు టేబుల్ టాపర్‌గా నిలిచారు. సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఫైనల్‌కి ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ప్రాక్టీస్ సెషన్‌ని రద్దు చేసింది. ఆటగాళ్లు ఎలాంటి గాయాల బారిన పడకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సెమీ ఫైనల్‌కి, ఫైనల్ మ్యాచ్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ క్రమంలో ఆటగాళ్లకు గాయాలైతే వాటి నుంచి వెంటనే కోలుకోలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకునే.. ప్రాక్టీస్ సెషన్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు ప్రకటించింది.

సౌతాఫ్రికా టీమ్ మాత్రం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది. నెట్స్‌లో ఆటగాళ్లందరూ తీవ్రంగా శ్రమించారు. సౌతాఫ్రికా చరిత్రలోనే తొలిసారి ఫైనల్స్‌కు చేరుకుంది. ఎలాగైనా మ్యాచ్ గెలిచి, చరిత్ర సృష్టించాలని చూస్తోంది. టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్, సూర్యకుమార్, పాండ్యా అదరగొడుతున్నారు. బుమ్రా, హర్షదీప్‌, కుల్‌దీప్‌, అక్షర్‌, జడేజాలు ఇరగదీస్తున్నారు. కాకపోతే కోహ్లీ ఒక్కడే నిరాశపరుస్తున్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ రన్‌మెషిన్ రాణిస్తే ఇండియాకు తిరుగుండదు. అటు సౌతాఫ్రికా కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో బలంగానే కనిపిస్తోంది. మరి.. సమఉజ్జీల మధ్య హోరాహోరీగా సాగనున్న పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి.

ఫైనల్ మ్యాచ్‌కి వాన గండం పొంచి ఉంది. బార్బడోస్‌లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వాన పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ విభాగం సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ సాగడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఆ రోజు కూడా వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్‌ జరగకపోతే, టోర్నమెంట్‌లో టీమిండియా-సౌతాఫ్రికా జట్లను విజేతగా ప్రకటిస్తారు.

ఇది చదవండి: రషీద్ భాయ్.! ఎందుకీ తలపొగరు.. చేజేతులా మ్యాచ్‌ను చెడగొట్టావ్ పో.. ఇదిగో ప్రూఫ్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.