NZ vs PAK, ICC World Cup: నేడు ప్రపంచ కప్‌లో 2 హై ఓల్టేజీ మ్యాచ్‌లు.. కివీస్ గెలిస్తే టోర్నీ నుంచి 4 జట్లు ఔట్..

England vs Australia, ICC ODI World Cup: న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫలితం ఈ రెండు జట్లపై మాత్రమే కాకుండా ఇతర జట్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఈరోజు న్యూజిలాండ్ గెలిస్తే పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌లు అధికారికంగా ప్రపంచకప్‌నకు దూరమవుతాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. కంగారూ దళంపై ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగగిస్తుందో లేదో చూడాలి. మరోవైపు సెమీఫైనల్‌కు వెళ్లాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

NZ vs PAK, ICC World Cup: నేడు ప్రపంచ కప్‌లో 2 హై ఓల్టేజీ మ్యాచ్‌లు.. కివీస్ గెలిస్తే టోర్నీ నుంచి 4 జట్లు ఔట్..
Nz Vs Pak, Aus Vs Eng

Updated on: Nov 04, 2023 | 8:08 AM

ఐసీసీ ప్రపంచకప్ (ICC ODI World Cup) 2023లో రెండు ముఖ్యమైన మ్యాచ్‌లు నేడు జరగనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో టామ్ లాథమ్ నేతృత్వంలోని న్యూజిలాండ్, బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ నేతృత్వంలోని ఇంగ్లండ్‌, పాట్‌ కమిన్స్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈరోజు జరగనున్న రెండు మ్యాచ్‌లు కూడా హై ఓల్టేజీ మ్యాచ్‌లే కావడం విశేషం.

కివీస్-పాక్..

న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫలితం ఈ రెండు జట్లపైనే కాకుండా ఇతర జట్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఈరోజు న్యూజిలాండ్ గెలిస్తే పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌లు అధికారికంగా ప్రపంచకప్‌నకు దూరమవుతాయి. అందుకే, బాబర్ సేన గెలవాలని ఇతర జట్లు కూడా కోరుకుంటున్నాయి. మళ్లీ విజయాల బాట పట్టిన పాక్ జట్లు.. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. మరోవైపు హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతున్న కివీస్‌కు కూడా గెలుపు అవసరం.

ఇవి కూడా చదవండి

ఆసీస్-ఇంగ్లండ్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. కంగారూ దళంపై ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగగిస్తుందో లేదో చూడాలి. మరోవైపు సెమీఫైనల్‌కు వెళ్లాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. కెప్టెన్‌గా జోస్ బట్లర్ పూర్తిగా విఫలమయ్యాడు. బంగ్లాదేశ్‌పై ఒక్క విజయం మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. నెదర్లాండ్స్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్ల కంటే ఎక్కువ విజయాలు సాధించింది.

జట్లు..

న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, విల్ యంగ్, కైల్ జామిసన్ .

పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, మహ్మద్ అఫ్రిది వాసిం.

ఇంగ్లండ్ జట్టు: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్ .

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, సీన్ అబోట్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..