IND vs ENG: రో’హిట్’.. షమీ, బుమ్రా సూపర్ స్పెల్‌.. ఇండియా vs ఇంగ్లండ్‌ మ్యాచ్‌ హైలెట్స్‌ వీడియో చూశారా?

|

Oct 30, 2023 | 7:14 AM

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 229 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్లకు తలొగ్గి కేవలం 129 పరుగులకే ఆలౌటైంది.  టీమిండియా తరఫున మహ్మద్ షమీ నాలుగు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశారు. కుల్‌ దీప్‌ రెండు, జడేజా ఒక వికెట్‌ పడగొట్టారు.

IND vs ENG: రోహిట్.. షమీ, బుమ్రా సూపర్ స్పెల్‌.. ఇండియా vs ఇంగ్లండ్‌ మ్యాచ్‌ హైలెట్స్‌ వీడియో చూశారా?
India Vs England
Follow us on

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం డిపెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు సెమీ-ఫైనల్‌లో తన స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది టీమిండియా. కాగా ప్రపంచకప్‌లో సుమారు 20 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై విజయం సాధించింది టీమిండియా. చివరిసారిగా సౌరవ్ గంగూలీ నేతృత్వంలో 2003లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ ఇంగ్లిష్‌ జట్టును ఓడించింది. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌కు వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి. అయితే తాజా మ్యాచ్‌తో వీటికి అడ్డు కట్ట వేసింది రోహిత్‌ సేన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 229 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు భారత బౌలర్లకు తలొగ్గి కేవలం 129 పరుగులకే ఆలౌటైంది.  టీమిండియా తరఫున మహ్మద్ షమీ నాలుగు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీశారు. కుల్‌ దీప్‌ రెండు, జడేజా ఒక వికెట్‌ పడగొట్టారు.

కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ హైలెట్‌గా నిలిచింది. ఓవైపు వికెట్లు పడుతున్నా క్రీజులో నిలదొక్కుకుని సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు హిట్‌ మ్యాచ్‌. 66 బంతుల్లో 54వ వన్డే హాఫ్ సెంచరీని పూర్తి చేసిన రోహిత్‌.. ఓవరాల్‌గా 101 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్స్‌ లు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో బుమ్రా, మహ్మద్‌ షమీ అదర గొట్టారు. నేరుగా వికెట్లకు బంతులేస్తూ ఇంగ్లిష్‌ బ్యాటర్లను హడలెత్తించారు. దెబ్బకు 129 పరుగులకే ఇంగ్లండ్‌ కుప్పకూలింది. మరి ఎంతో థ్రిల్‌కు గురిచేసిన ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌ను మిస్‌ అయ్యారా? అయితే హైలెట్స్‌ చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పూర్తి మ్యాచ్ హైలెట్స్..

ఇండియా గెలుపు సంబరాలు ..

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..