టీమిండియాపై వకార్ ఫైర్!

| Edited By:

Jul 01, 2019 | 7:00 PM

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో చేతిలో టీమిండియా ఓడిపోవడంపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వకార్‌ యునిస్‌ పరోక్షంగా కోహ్లీసేనపై విమర్శలు గుప్పించాడు. క్రీడాస్ఫూర్తి ఎక్కడుందంటూ ప్రశ్నించాడు. ఇంగ్లాండ్‌ గెలుపుతో పాక్‌కు దాదాపు సెమీస్‌ అవకాశాలు మూసుకుపోయిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించాడు. పాక్‌కు అవకాశాలు సన్నగిల్లడానికి భారత్‌ కారణమనే సందేశాన్ని రుద్దే ప్రయత్నం చేసి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో యునిస్‌ ట్వీట్ చేశాడు. ‘‘నువ్వు ఎవరనేది ముఖ్యం కాదు. జీవితంలో ఎలా వ్యవహరిస్తున్నావనే దాని బట్టి నువ్వు […]

టీమిండియాపై వకార్ ఫైర్!
Follow us on

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో చేతిలో టీమిండియా ఓడిపోవడంపై పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వకార్‌ యునిస్‌ పరోక్షంగా కోహ్లీసేనపై విమర్శలు గుప్పించాడు. క్రీడాస్ఫూర్తి ఎక్కడుందంటూ ప్రశ్నించాడు. ఇంగ్లాండ్‌ గెలుపుతో పాక్‌కు దాదాపు సెమీస్‌ అవకాశాలు మూసుకుపోయిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించాడు. పాక్‌కు అవకాశాలు సన్నగిల్లడానికి భారత్‌ కారణమనే సందేశాన్ని రుద్దే ప్రయత్నం చేసి తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో యునిస్‌ ట్వీట్ చేశాడు.

‘‘నువ్వు ఎవరనేది ముఖ్యం కాదు. జీవితంలో ఎలా వ్యవహరిస్తున్నావనే దాని బట్టి నువ్వు ఎవరు అనేది తేలుతుంది. పాకిస్థాన్‌ సెమీస్‌కు వెళ్తుందా? వెళ్లదా? అనేదానిపై నాకు పెద్దగా పట్టింపులు లేవు. కానీ కొందరు ఛాంపియన్ల క్రీడాస్ఫూర్తిని పరీక్షించగా.. అది ఘోరంగా విఫలమైంది’’ అంటూ #INDvsEND హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించి పరోక్షంగా టీమిండియాపై విమర్శలు గుప్పించాడు.