2019 వరల్డ్ కప్‌లో అద్భుత ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా టీంకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఏస్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ గాయం కారణంగా టోర్నీ నుంచి దూరమైనట్టు ఐసీసీ ప్రకటించింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి బలంగా తగలడంతో మార్ష్ మణికట్టు విరిగిందని తెలిపింది.
కాగా అతని ప్లేస్‌లో వికెట్ కీపర్ పీటర్ హ్యాండ్స్కాంబ్ జట్టులోకి రానున్నాడని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. కాగా రేపు మాంచెస్టర్‌లో సౌతాఫ్రికాతో ఆసీస్ తలపడనుంది.