ఐసీసీ వరల్ద్ కప్ 2019: వానంటే వణుకుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు
జూన్ 16న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం పడకూడదని అంతా కోరుకుంటే… వర్షం పడి… ఆటకు ఇబ్బంది కలిగించింది. ఐతే… మ్యాచ్ రద్దవ్వకపోవడంతో… ఇన్సూరెన్స్ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ మ్యాచ్‌లకూ, ఇన్సూరెన్స్ కంపెనీలకూ లింక్ ఏంటంటే… ఐసీసీ బ్రాడ్ కాస్టింగ్ హక్కుల్ని కొన్ని సంస్థలు దక్కించుకుని… ప్రతీ మ్యాచ్‌కీ ఇన్సూరెన్స్ చేయించుకున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే… ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాయి. అందుకోసం ఇన్సూరెన్స్ సంస్థలు దాదాపు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సెమీ ఫైనల్స్‌కి […]
జూన్ 16న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి వర్షం పడకూడదని అంతా కోరుకుంటే… వర్షం పడి… ఆటకు ఇబ్బంది కలిగించింది. ఐతే… మ్యాచ్ రద్దవ్వకపోవడంతో… ఇన్సూరెన్స్ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ మ్యాచ్‌లకూ, ఇన్సూరెన్స్ కంపెనీలకూ లింక్ ఏంటంటే… ఐసీసీ బ్రాడ్ కాస్టింగ్ హక్కుల్ని కొన్ని సంస్థలు దక్కించుకుని… ప్రతీ మ్యాచ్‌కీ ఇన్సూరెన్స్ చేయించుకున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే… ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాయి. అందుకోసం ఇన్సూరెన్స్ సంస్థలు దాదాపు రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సెమీ ఫైనల్స్‌కి ముందు టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లకు ఈ రూల్ ఉంది. అందువల్ల టీమిండియా ఆడే మ్యాచ్‌లకు వర్షం పడకూడదని, మ్యాచ్ రద్దు కాకూడదనీ ఇన్సూరెన్స్ కంపెనీలు పదే పదే దైవాన్ని ప్రార్థిస్తున్నాయి.
ఇప్పటివరకూ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ రద్దైంది. అందువల్ల బీమా కంపెనీలు రూ.100 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. సెమీ ఫైనల్స్‌కి టీమిండియా మరో 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటికి గనక వర్షం పడితే… ఇక తమకు తిప్పలు తప్పవని భావిస్తున్నాయి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, న్యూ ఇండియా అష్యూరెన్స్, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీలు.