18 బంతుల్లో 9 పరుగులు చేయలేకపోయిన ఇంగ్లాండ్.. వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి..

| Edited By: Srinivas Chekkilla

Mar 09, 2022 | 2:17 PM

ICC Womens World Cup 2022:ICC మహిళల ప్రపంచ కప్ 2022 లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇప్పుడు డిఫెండింగ్

18 బంతుల్లో 9 పరుగులు చేయలేకపోయిన ఇంగ్లాండ్.. వెస్టిండీస్ చేతిలో ఘోర ఓటమి..
West Indies Beat England
Follow us on

ICC Womens World Cup 2022:ICC మహిళల ప్రపంచ కప్ 2022 లో వెస్టిండీస్ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతోంది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ని కూడా మట్టికరిపించింది. ఇంగ్లండ్ జట్టు విజయానికి 226 పరుగులు చేయాల్సి ఉంది. కానీ 47.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ ఖచ్చితంగా విజయం అంచున ఉంది. అయితే వెస్టిండీస్ బౌలర్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కి షాక్‌ ఇచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చివరి 18 బంతుల్లో ఇంగ్లండ్‌కు కేవలం 9 పరుగులు మాత్రమే అవసరం. చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. సోఫీ ఎక్లెస్టోన్, కేస్ క్రాస్ జంట క్రీజులో ఉన్నారు. అయినా వెస్టిండీస్ గెలిచింది. ఇంగ్లండ్ జట్టు 3 ఓవర్లలో 9 పరుగులు చేయాల్సి ఉండగా రెండు వికెట్లు మిగిలాయి. ఎక్లెస్టోన్ 32, కేట్ క్రాస్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అనిస్సా మహ్మద్‌కు బౌలింగ్‌కి దిగింది. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లి వెస్టీండిస్‌ని గెలిపించింది.

48వ ఓవర్ మొదటి బంతి – అనిస్సా మొహమ్మద్ వేసిన మొదటి బంతికి ఎక్లెస్టోన్ స్ట్రైక్‌లో ఉంది. ఆమె షాట్‌ ఆడగా బంతి నేరుగా అనిస్సా మహ్మద్ వేళ్లకు తగిలి వికెట్‌కు తగులుతుంది. నాన్‌స్ట్రైక్‌పై నిలబడిన కేట్ క్రాస్ క్రీజ్ బయట ఉంటుంది. దీంతో ఆమె రనౌట్‌ అవుతుంది.

48వ ఓవర్, రెండో బంతి – చివరి వికెట్ మిగిలి ఉన్నప్పటికీ ఎక్లెస్టోన్ ఒక పరుగు తీసుకొని స్ట్రైక్‌ మారుతుంది. చివరి బ్యాట్స్‌మెన్ అన్య షర్బాసోల్ స్ట్రైక్‌లోకి వస్తుంది.

48వ ఓవర్, మూడో బంతి – అనిస్సా మహ్మద్ వేసిన బంతిని షర్బాసోల్ ఆపుతుంది. పరుగులు ఏమి రావు.

48వ ఓవర్, నాలుగో బంతి – షర్బాసోల్ ముందుకు వెళ్లి బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అది మిస్‌ అయి వికెట్లకి తగులుతుంది. దీంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో విజయం సాధిస్తుంది.

Beauti Tips: అందమైన పెదాల కోసం అదిరే చిట్కాలు.. ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు..!

Arjuna Fruit: అర్జునపండులో అదిరే ఔషధ గుణాలు.. నోటి దుర్వాసనకి చక్కటి పరిష్కారం..

Knowledge: ఆ దేశ కరెన్సీ డాలర్‌ కంటే చాలా ఎక్కువ.. ఎందుకో తెలుసా..?