
Pakistan Prize Money T20 World Cup: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు సంబంధించిన మొత్తం ప్రైజ్ మనీ పంపిణీని ప్రకటించింది. మొత్తం 11.25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.103 కోట్లు) ప్రైజ్ పూల్‌గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని గ్రూప్ స్టేజ్, సూపర్-8, సెమీ ఫైనల్, ఫైనల్ వరకు జట్ల ప్రదర్శన ఆధారంగా పంచారు. ప్రతి జట్టుకు మొదటిగా పాల్గొన్నందుకు $225,000 బేస్ పేమెంట్ అందించింది. అదనంగా మ్యాచ్‌లలో విజయాలు, తదుపరి దశలకు చేరడం వంటి అంశాల ఆధారంగా బోనస్‌లు కూడా కలిపి మొత్తాన్ని లెక్కించారు.
టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు అత్యధిక ప్రైజ్ మనీ అందుకుంది. భారత జట్టుకు $2,639,423 (సుమారు రూ.24.25 కోట్లు) లభించాయి. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు $1,422,692 (సుమారు రూ.13.08 కోట్లు) అందాయి. సెమీ ఫైనల్‌లో ఓడిన దక్షిణాఫ్రికాకు $1,005,577 (సుమారు రూ.9.24 కోట్లు) దక్కగా, ఇంగ్లాండ్‌కు $974,423 (సుమారు రూ.8.96 కోట్లు) లభించాయి. ఇక పాకిస్థాన్ జట్టుకు $522,692 (సుమారు రూ.4.80 కోట్లు) ప్రైజ్ మనీగా అందింది.
వెస్టిండీస్‌కు $538,269 లభించగా, జింబాబ్వే $491,538 సంపాదించింది. శ్రీలంకకు $475,962 అందింది. అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ జట్లకు ఒక్కొక్కటికి $309,808 చొప్పున ఇచ్చారు. స్కాట్లాండ్‌కు $278,654, ఐర్లాండ్‌కు $271,731 అందాయి. ఇటలీ, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్ జట్లకు $256,154 చొప్పున లభించాయి. కెనడా, నమీబియా, ఒమాన్ జట్లకు $225,000 చొప్పున పాల్గొనడం కోసం బేస్ ప్రైజ్ మనీ అందించారు.
టీ20 వరల్డ్ కప్ విజయం సాధించిన భారత జట్టుకు బీసీసీఐ కూడా భారీ బహుమతి ప్రకటించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మొత్తం రూ.131 కోట్ల క్యాష్ రివార్డ్‌ను జట్టుకు ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, “టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు రూ.131 కోట్ల బహుమతి అందజేస్తున్నాం. ఇది ఇప్పటివరకు భారత జట్టుకు ఇచ్చిన అతిపెద్ద ప్రైజ్ మనీ. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అందరికీ అభినందనలు” అని తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..