IPL vs PSL: ఐపీఎల్‌పై కుట్రలకు ఫలితం.. పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. భారీ నష్టాల్లో పీసీబీ.. ఎందుకంటే?

|

Aug 18, 2022 | 9:46 AM

IPL vs PSL: 2025లో PSL, IPL తేదీల మధ్య పోటీ నెలకొంది. పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కారణంగా ఈ అయోమయం ఏర్పడింది.

IPL vs PSL: ఐపీఎల్‌పై కుట్రలకు ఫలితం.. పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. భారీ నష్టాల్లో పీసీబీ.. ఎందుకంటే?
Ipl Vs Psl
Follow us on

IPL vs PSL: క్రికెట్‌లోనే అతిపెద్ద లీగ్ IPLపై పాకిస్తాన్ నిరంతరం ఏదో రకంగా అసూయపడుతూనే ఉంటుంది. మొన్నటి దాక ఐసీసీ ముందు ఐపీఎల్ విండోపై పలు ఫిర్యాదులు చేసి, చేయి కాల్చుకుంది. అయితే, ఐసీసీ తాజా నిర్ణయంతో పాకిస్తాన్‌కు మరోసారి ఘోరమైన దెబ్బ తగిలింది. దీంతో పీఎస్ఎల్ రూపంలో భారీ నష్టం వాటిల్లనుంది. దీంతో పాకిస్తాన్ నెత్తి నోరూ బాదుకుంటుంది. అలాగే ఐపీఎల్ జరిగే సమయంలోనే పీఎస్ఎల్ కూడా జరగనుండడంతో ఈ నిరాశ మరికాస్త ఎక్కువైంది. వాస్తవానికి, 2025లో ఈ రెండు లీగ్‌ల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, దేశవాళీ క్రికెట్ బిజీ సీజన్ మధ్య పీఎస్ఎల్ లీగ్‌ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

భారతదేశంలో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి నెల నుంచి ప్రారంభమై జూన్ మొదటి వారం వరకు కొనసాగుతుంది. ఇది దాదాపు రెండున్నర నెలల పాటు కొనసాగుతుంది. అదే సమయంలో పాకిస్తాన్‌లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరగనుంది. కానీ, ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాల్సి ఉంది. అందువల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PSLని మార్చి నుంచి మే విండోకు మార్చవలసి ఉంటుంది.

30 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో ఐసీసీ టోర్నీ..

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌లో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. నిజానికి 2025లో జరిగే ICC ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కొంత కాలంగా భద్రత దృష్ట్యా పాకిస్థాన్‌లో ఏ జట్టు కూడా ఆడేందుకు నిరాకరిస్తోంది. అయితే, 2023-2027 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో పాకిస్థాన్ కూడా 13 టెస్టులు, 26 వన్డేలు, 27 టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

అదే సమయంలో, పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీపడటం కూడా ఇదే మొదటిసారి. రెండు లీగ్‌ల తేదీలు క్లాష్ అయితే, ఆటగాళ్లు ఏ లీగ్‌లో ఆడేందుకు ఇష్టపడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే జరిగితే పాకిస్తాన్ బోర్డ్‌కు తీవ్రమైన నష్టం ఏర్పడనుంది. దీంతో అటు పీఎస్ఎల్‌తోనే కాదు, ఇటు ఆటగాళ్ల రూపంలోనూ పీసీబీకి ఘోర అవమానం తప్పదని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

చాలా బిజీగా భారత జట్టు షెడ్యూల్..

ICC ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) కింద భారత పురుషుల జట్టు వచ్చే ఐదేళ్లలో అంటే మే 2023 నుంచి ఏప్రిల్ 2027 వరకు 141 ద్వైపాక్షిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఐదేళ్లలో భారత జట్టు 38 టెస్టులు, 42 వన్డేలు, 61 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు.