AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Bowling Ranking: బౌలర్ల ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. ఆ ముగ్గురు మామూలోళ్లు కాదు.. మూడు ఫార్మాట్లలో టాప్ లేపేశారు

ఐసీసీ తన తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) వేర్వేరు బౌలర్లు ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలిచారు. భారత్‌కు చెందిన జస్ప్రీత్ బుమ్రా, దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, న్యూజిలాండ్‌కు చెందిన జాకోబ్ డఫీ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నారు.

ICC Bowling Ranking: బౌలర్ల ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. ఆ ముగ్గురు మామూలోళ్లు కాదు.. మూడు ఫార్మాట్లలో టాప్ లేపేశారు
Icc Bowling Ranking
Rakesh
|

Updated on: Sep 04, 2025 | 7:50 AM

Share

ICC Bowling Ranking: ఐసీసీ తన తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ఫార్మాట్‌లలో – టెస్ట్, వన్డే, టీ20లలో – ముగ్గురు వేర్వేరు బౌలర్లు ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. టెస్టుల్లో భారత్‌కు చెందిన జస్ప్రీత్ బుమ్రా, వన్డేల్లో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, టీ20లో న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీ అగ్రస్థానంలో ఉన్నారు. ఏ ఫార్మాట్‌లో ఏ బౌలర్ నంబర్ 1గా ఉన్నాడో తెలుసుకుందాం.

టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా ఆధిపత్యం

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. అతడి వద్ద 889 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బుమ్రా కెరీర్​లో అత్యధికంగా 908 రేటింగ్ పాయింట్లను 2025లో ఆస్ట్రేలియాపై సిడ్నీ టెస్టులో సాధించాడు. తన స్పెషల్ బౌలింగ్ శైలి, పర్ఫెక్ట్ యార్కర్లకు బుమ్రా ప్రసిద్ధి. అతని బౌలింగ్‌తో ఎన్నోసార్లు మ్యాచ్​ను మలుపు తిప్పి భారత్‌కు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై అతడి ప్రదర్శన టీమిండియాకు పెద్ద బలంగా మారింది.

వన్డేలో కేశవ్ మహారాజ్ సత్తా

వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహారాజ్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతనికి 671 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అతని కెరీర్​లో అత్యధికంగా 741 రేటింగ్ పాయింట్లను 2023లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాపై సాధించాడు. మహారాజ్ తన కంట్రోల్డ్ బౌలింగ్, బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెంచేందుకు పేరుగాంచాడు. వన్డే క్రికెట్‌లో తన ఖచ్చితత్వం, ఓర్పుతో అనేక కీలక మ్యాచ్‌లలో తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.

టీ20లో నంబర్ 1 స్థానానికి జాకబ్ డఫీ

టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. అతని ఖాతాలో 717 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అతని కెరీర్​లో అత్యధికంగా 750 రేటింగ్ పాయింట్లను 2025లో హరారేలో దక్షిణాఫ్రికాపై సాధించాడు. డఫీ తన వేగవంతమైన బౌలింగ్, స్వింగ్, డెత్ ఓవర్లలో కంట్రోల్డ్‎కు పేరుగాంచాడు. అతని బౌలింగ్‌లో వైవిధ్యం బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్