Virat Kohli: ఎంత ఖర్చైనా పర్లేదు.. కోహ్లీ నుంచి అది దొబ్బేస్తా: తెలుగబ్బాయ్ బిగ్ స్టేట్‌మెంట్

Team India: 2025 టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది భారతదేశంలో జరగనుంది. అంతకుముందు, 15 మంది సభ్యుల జట్టులో టీమ్ ఇండియాలో భాగంకాగల ఆటగాళ్లపై భారత సెలెక్టర్లు కన్నేసి ఉంచుతున్నారు. మీడియా నివేదికల మేరకు, ఆ ఆటగాళ్లలో తిలక్ వర్మ పేరు కూడా ఉంది.

Virat Kohli: ఎంత ఖర్చైనా పర్లేదు.. కోహ్లీ నుంచి అది దొబ్బేస్తా: తెలుగబ్బాయ్ బిగ్ స్టేట్‌మెంట్
Virat Kohli And Tilak Varma

Updated on: May 10, 2025 | 12:47 PM

Virat Kohli – Tilak Varma: విరాట్ కోహ్లీ ప్రపంచంలోని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. దిగ్గజ బ్యాట్స్‌మెన్ల జాబితాలో అతని పేరు రెండవ స్థానంలో ఉంది. సచిన్ టెండూల్కర్ తర్వాత, ఏ ఆటగాడైనా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడంటే అది కింగ్ కోహ్లీయే. విరాట్ తన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని అలరించాడు. అదే సమయంలో, టీం ఇండియా వర్ధమాన బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ కూడా కొన్ని విరాట్ కోహ్లీ షాట్లతో వెలుగులోకి వచ్చాడు. అయితే, ఓ విలువైన వస్తువును విరాట్ కోహ్లీ నుంచి తీసుకోవాలని కోరుకుంటున్నాడు.

ఆ విలువైన వస్తువు ఏంటంటే?

తిలక్ వర్మ భారతదేశంలోని వర్ధమాన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తిలక్ బ్యాట్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి తుఫాన్ ఇన్నింగ్స్‌లు కనిపించాయి. తిలక్ వర్మ కూడా టీం ఇండియా లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ నుంచి చాలా ప్రేరణ పొందాడు. భవిష్యత్తులో నేను కూడా ఆయన బాటలోనే నడవాలనుకుంటున్నాను అంటూ చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.

విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్‌ చూస్తే.. కచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. అతని కవర్ డ్రైవ్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కోహ్లీ కంటే బెస్ట్ కవర్ డ్రైవ్ ఎవరూ ఆడలేరు. అందుకే, తిలక్ వర్మ కింగ్ కోహ్లీ కవర్ డ్రైవ్ షార్ట్‌ను అప్పుగా తీసుకోవాలనుకుంటున్నాడంట. స్టార్ స్పోర్ట్స్‌లో తిలక్ వర్మ మాట్లాడుతూ, “నేను విరాట్ కోహ్లీ భాయ్ కవర్ డ్రైవ్ షాట్‌ను అరువుగా తీసుకోవాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటోన్న తిలక్ వర్మ..

తిలక్ వర్మ వయసు కేవలం 22 సంవత్సరాలు. తన దూకుడు బ్యాటింగ్ ఆధారంగా, అతను భారతదేశం తరపున వన్డే, టీ20లలో అరంగేట్రం చేశాడు. ఈ కాలంలో, అతని తుఫాన్ బ్యాటింగ్ విధ్వంసం కనిపించింది. అతను 4 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. కాగా, 25 టీ20 మ్యాచ్‌లు ఆడారు. దీనిలో అతను 50 సగటుతో 749 పరుగులు చేశాడు. ఈ కాలంలో, అతని బ్యాట్ నుంచి 2 సెంచరీలు కూడా కనిపించాయి. ఇది ఎంతో అరుదైన విషయం. బ్యాట్స్‌మెన్ కెరీర్ క్లోజ్ అయిపోతున్నా.. చాలామంది ప్లేయర్లు మాతరం టీ20లో సెంచరీ చేయలేకపోతున్నారు.

2025 టీ20 ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకోగలరా?

2025 టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది భారతదేశంలో జరగనుంది. అంతకుముందు, 15 మంది సభ్యుల జట్టులో టీమ్ ఇండియాలో భాగంకాగల ఆటగాళ్లపై భారత సెలెక్టర్లు కన్నేసి ఉంచుతున్నారు. మీడియా నివేదికల మేరకు, ఆ ఆటగాళ్లలో తిలక్ వర్మ పేరు కూడా ఉంది. తిలక్ వర్మ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. అతను కూడా జట్టులో ఉంటే టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..