Viral Video: గజినీలా మారిన సూర్య.. రోహిత్ పూనాడంటూ స్టేడియంలో నవ్వులు.. వీడియో చూస్తే

Suryakumar Yadav Become Like Rohit Sharma on IND vs OMA Toss Video Viral: అబుదాబి మైదానంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఓ సీన్ చూస్తే నవ్వుకోవాల్సిందే.

Viral Video: గజినీలా మారిన సూర్య.. రోహిత్ పూనాడంటూ స్టేడియంలో నవ్వులు.. వీడియో చూస్తే
Suryakumar Yadav

Updated on: Sep 20, 2025 | 7:29 AM

Suryakumar Yadav Become Like Rohit Sharma on IND vs OMA Toss Video Viral: ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు టాస్ సమయంలో పొరపాటు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సమయంలో రవిశాస్త్రి టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ గురించి అడిగినప్పుడు, అతను టీంలో మార్పుల గురించి మరచిపోయి రోహిత్ శర్మ పేరును ప్రస్తావిస్తూ నవ్వాడు.

ప్లేయింగ్ ఎలెవన్‌ను మర్చిపోయిన సూర్యకుమార్ యాదవ్..

టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్, అబుదాబి మైదానంలో బ్యాటర్లకు సరైన అవకాశం ఇవ్వడానికి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత జట్టులో రెండు మార్పులు చేసినట్లు ప్రకటించాడు. హర్షిత్ రాణా జట్టులోకి వచ్చాడు. రెండవది.. అంటూ సూర్యకుమార్ యాదవ్ అయోమయంలో పడ్డాడు. ఎంత ప్రయత్నించినా రెండవ మార్పు గుర్తుకు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో సూర్య నవ్వుతూ, “నేను రోహిత్ శర్మ అయ్యాను” అని చెప్పుకొచ్చాడు. టాస్ సమయంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌లో మార్పులను రోహిత్ శర్మ తరచుగా మర్చిపోతున్నందున సూర్యకుమార్ యాదవ్ ఇలా అన్నాడు. అయితే, రోహిత్ పేరు చెప్పగానే సూర్యకుమార్ యాదవ్ నవ్వి వెళ్లిపోయాడు. ఆ తర్వాత, ఒమన్ కెప్టెన్ జతీందర్ కూడా తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను మర్చిపోవడం గమనార్హం.

సూర్యకుమార్ వీడియో..

ఆసియా కప్‌ 2025లో గ్రూప్ దశను భారత్ అజేయంగా ముగించింది. తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. సంజు శాంసన్ హాఫ్ సెంచరీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మల షాట్‌లతో టీమిండియా ఎనిమిది వికెట్లకు 188 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా అర్ధ సెంచరీలతో ఒమన్ బలమైన పోరాటం చేసింది. కానీ, చివరికి విజయానికి 21 పరుగుల దూరంలో ఓడిపోయింది. నాలుగు వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ ఇప్పుడు ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్‌లో ఆడాల్సి ఉంది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..