HCA: టై మ్యాచ్‌ను తలపిస్తోన్న హెచ్‌సీఏ వివాదం.. అజర్ Vs అపెక్స్ మధ్య టగ్ ఆఫ్‌ వార్

|

Jul 07, 2021 | 3:42 PM

హెచ్‌సీ‌ఏ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ ఆధిపత్య పోరుకు ఒక అంతంటూ లేకుండా పోతోంది...

HCA: టై మ్యాచ్‌ను తలపిస్తోన్న హెచ్‌సీఏ వివాదం.. అజర్ Vs అపెక్స్ మధ్య టగ్ ఆఫ్‌ వార్
HCA
Follow us on

Azhar vs Apex council: హెచ్‌సీ‌ఏ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ ఆధిపత్య పోరుకు ఒక అంతంటూ లేకుండా పోతోంది. అజర్ వర్సెస్ అపెక్స్ మధ్య నువ్వా నేనా టగ్ ఆఫ్‌ వార్ నడుస్తోంది. దీంతో మహ్మద్ అజహరుద్దీన్ వర్సెస్ అపెక్స్ కౌన్సిల్ వివాదం కాస్తా.. టై మ్యాచ్ ను తలపిస్తోంది. అజహరుద్దీన్ ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడం, దీనిపై పాత కౌన్సిల్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం, ఈ పిటిషన్ ను జస్టిస్ అమర్నాథ్ గౌడ్ బెంచ్ విచారించి అంబుడ్స్ మన్ నిర్ణయాలపై స్టే విధించడం తెలిసిందే.

కొంత కాలంగా అంబుడ్స్‌మన్ – అపెక్స్ కౌన్సిల్ మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. ఇందుకు కారణం.. అజరుద్దీన్ అనుకూలమైన జస్టిస్ దీపక్ వర్మన్‌ను అంబుడ్స్‌మన్ గా నియమించడమేనంటారు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు. అంబుడ్స్‌మన్ గా దీపక్ వర్మ నియామకం చెల్లనే చెల్లదంటున్నారు అపెక్స్ మెంబర్స్. ఎందుకంటే దీపక్ వర్మ అజరుద్దీన్ అనుకూలమైన వ్యక్తి. కాబట్టి.. తాము ఒప్పుకునేది లేదంటూ మొండికేసింది అపెక్స్ కౌన్సిల్.

అపెక్స్ కౌన్సిల్ ఇరవై రోజుల క్రితం అజర్ ను హెచ్‌సీ‌ఏ అధ్యక్షుడిగా తొలగించి.. తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ ను నియమించింది. దీంతో అజరుద్దీన్.. అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించారు. దీంతో అంబుడ్స్ మన్ అపెక్స్ కౌన్సిల్ నే రద్దు చేశారు.

ఎప్పుడైతే అంబుడ్స్ మన్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ రద్దయ్యిందో.. ఆ వెంటనే జింఖాన గ్రౌండ్స్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టే యత్నం చేసింది పాత అపెక్స్ కౌన్సిల్. ఇక్కడా రసాబాసా అయింది. అంబుడ్స్‌మన్ నియామకమే చెల్లదంటుంటే.. ఆయన నిర్ణయాలు ఎలా చెట్టుబాటు అవుతాయ్ అంటూ అపెక్స్ కౌన్సిల్.. అజర్, అంబుడ్స్ మన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

క్యాన్సిల్ అయిన అపెక్స్ కమిటీ స్థానంలో కొత్తగా ఐదుగురితో కూడిన కొత్త కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు అజరుద్దీన్. దీంతో పాత కౌన్సిల్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అంబుడ్స్‌మన్ నిర్ణయాలపై స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం. ఈ క్రమంలో అంబుడ్స్‌మన్ వర్సెస్ అపెక్స్ కౌన్సిల్ వ్యవహారం టై మ్యాచ్ గా మారింది. మ్యాచ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఫైనల్ విన్నర్ ఎవరు..అన్నది పెద్ద సస్పెన్స్‌గా ఉంది.

Read also : ప్రతి గ్రామంలో ఒక మహిళ రూపంలో పోలీసు ప్రతినిధి ఉండాలనే ‘సంరక్షణ కార్యదర్శి’ అనే 15 వేల పోస్టులు సృష్టించాం : ఏపీ డీజీపీ