AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harshit Rana : జంపా రికార్డుకు అడ్డుకట్ట.. గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న హర్షిత్ రానా

శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మెన్ విఫలమైన అడిలైడ్ పిచ్‌పై హర్షిత్ రానా తన బ్యాటింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హర్షిత్ రానా 18 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేశాడు, దీంతో టీమిండియా 264 పరుగుల స్కోరుకు చేరుకుంది. ఒకానొక దశలో టీమిండియా 250 పరుగులు కూడా చేయలేదేమో అనిపించింది.

Harshit Rana : జంపా రికార్డుకు అడ్డుకట్ట.. గౌతమ్ గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న హర్షిత్ రానా
Harshit Rana
Rakesh
|

Updated on: Oct 23, 2025 | 3:09 PM

Share

Harshit Rana : హర్షిత్ రానా పేరు చెప్పగానే చాలా మంది భారతీయ క్రికెట్ అభిమానులు ఎక్కువగా విమర్శలు చేస్తూ కనిపిస్తారు. సోషల్ మీడియాలో ఈ ఆటగాడికి చప్పట్ల కంటే తిట్లే ఎక్కువ వస్తాయి. కానీ అడిలైడ్‌లో హర్షిత్ రానా మ్యాజిక్ చేశాడు. దీంతో జనాలు అతని టాలెంటును గుర్తించారు. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్‌మెన్ విఫలమైన అడిలైడ్ పిచ్‌పై హర్షిత్ రానా తన బ్యాటింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హర్షిత్ రానా 18 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేశాడు, దీంతో టీమిండియా 264 పరుగుల స్కోరుకు చేరుకుంది. ఒకానొక దశలో టీమిండియా 250 పరుగులు కూడా చేయలేదేమో అనిపించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హర్షిత్ రానా అడిలైడ్‌లో అప్పటి వరకు అత్యుత్తమంగా రాణిస్తున్న బౌలర్‌ను చితకబాదాడు. హర్షిత్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ బౌలర్ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు, కానీ అతని చివరి ఓవర్‌లో హర్షిత్ రానా అతని గణాంకాలను పూర్తిగా మార్చేశాడు. రానా అతని చివరి ఓవర్‌లో మూడు బౌండరీలు కొట్టి 16 పరుగులు రాబట్టాడు, దీని ఫలితంగా జంపా ఒక పెద్ద రికార్డును క్రియేట్ చేయలేకపోయాడు.

వాస్తవానికి ఆడమ్ జంపాకు తన సొంత గడ్డపై భారత్‌పై వన్డేలలో అత్యుత్తమ ప్రదర్శన చేసే అవకాశం లభించింది, కానీ అది సాధ్యం కాలేదు. జంపా 9 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఒకవేళ అతను 54 పరుగుల కంటే తక్కువ ఇచ్చి ఉంటే, అది భారత్‌పై అతని అత్యుత్తమ ప్రదర్శన అయ్యేది. కానీ ఈ ఓవర్‌లో హర్షిత్ రానా 16 పరుగులు కొట్టి అతని గణాంకాలను చెదరగొట్టాడు. హర్షిత్ రానా తనలో బ్యాటింగ్ టాలెంట్ ఉందని నిరూపించాడు, బహుశా అందుకే గౌతమ్ గంభీర్ అతనిపై నమ్మకం ఉంచుతాడు.

అడిలైడ్ వన్డేలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. రోహిత్ శర్మ 73 పరుగులు చేయగా, శ్రేయస్ అయ్యర్ 61 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ మూడో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, జట్టును ప్రారంభ షాక్‌ల నుండి బయటపడేశారు. ఈ ఇద్దరితో పాటు అక్షర్ పటేల్ 41 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..