Video: ఓ మై గాడ్.. బ్రూక్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్‌కు నోరెళ్లబెట్టిన స్టోక్స్.. వీడియో చూస్తే షాకే

Harry Brook Stunning One Handed Catch Test Cricket: ఇంగ్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ ఒంటిచేతి క్యాచ్‌తో ప్రపంచాన్ని ఆకర్షించాడు. వెస్లీ మాధెవెరేను ఔట్ చేసిన ఈ క్యాచ్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. బెన్ స్టోక్స్ కూడా ఈ క్యాచ్‌కు ఆశ్చర్యపోయాడు. ఇంగ్లాండ్ ఘన విజయం సాధించగా, బ్రూక్ క్యాచ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Video: ఓ మై గాడ్.. బ్రూక్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్‌కు నోరెళ్లబెట్టిన స్టోక్స్.. వీడియో చూస్తే షాకే
Harry Brooke Catch

Updated on: May 25, 2025 | 10:43 AM

England vs Zimbabwe Harry Brook Catch: ఇంగ్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ యువ ఫీల్డర్ హ్యారీ బ్రూక్ పట్టిన ఒక క్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో వెస్లీ మాధెవెరేను ఔట్ చేయడానికి బ్రూక్ అందుకున్న ఈ ఒంటిచేతి స్టన్నింగ్ క్యాచ్, మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సాక్షాత్తూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఈ క్యాచ్ చూసి బిత్తరపోయాడు.

మ్యాచ్ మూడో రోజు అద్భుతం..

మే 22న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు (మే 24, 2025) జింబాబ్వే తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకు ఆలౌటై, ఫాలోఆన్ ఆడుతున్న జింబాబ్వే జట్టును ఆదుకునే ప్రయత్నంలో వెస్లీ మాధెవెరే (31 పరుగులు) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇన్నింగ్స్ కీలక దశలో, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వయంగా బౌలింగ్‌కు వచ్చాడు. స్టోక్స్ వేసిన బంతిని మాధెవెరే కట్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి వేగంగా సెకండ్ స్లిప్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్, దాదాపు అసాధ్యమనుకున్న రీతిలో తన కుడివైపునకు గాల్లోకి ఎగిరి, ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. కళ్లు చెదిరే రీతిలో బ్రూక్ అందుకున్న ఈ క్యాచ్ చూసి మైదానంలోని ఆటగాళ్లతో పాటు, ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.

ఆశ్చర్య పోయిన స్టోక్స్..

బ్రూక్ అద్భుత విన్యాసానికి బౌలర్ అయిన బెన్ స్టోక్స్ నోట మాట రాలేదు. అతను నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయాడు. స్టోక్స్ ఆశ్చర్యపోతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్యాచ్‌తో 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాధెవెరే నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వికెట్, జింబాబ్వే పతనాన్ని మరింత వేగవంతం చేసింది.

ఇంగ్లాండ్ ఘనవిజయం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, బెన్ డకెట్ (140), జాక్ క్రాలీ (124), ఓలీ పోప్ (171) సెంచరీలతో చెలరేగడంతో 6 వికెట్ల నష్టానికి 565 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో (ఫాలోఆన్) 255 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

అయితే, మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువగా హ్యారీ బ్రూక్ పట్టిన ఆ అసాధారణ క్యాచ్ గురించే క్రికెట్ అభిమానులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోని అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..