టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లోనే కాకుండా రియాలిటీ షో హోస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేసిన సల్మాన్, ఒక కార్యక్రమంలో యువరాజ్, హర్భజన్‌తో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ ముగ్గురు కలసి చేసిన జోకులు ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాయి.
సల్మాన్ తన సినిమా షూటింగ్ గురించి ముచ్చటిస్తుండగా, హర్భజన్ సరదాగా వివేక్ ఒబెరాయ్ గురించి కామెంట్ చేశాడు. “ఎవరి వెనక పరిగెడుతున్నావ్? వివేక్ ఒబెరాయ్ వెంటా?” అని హర్భజన్ అడగగా, యూవీతో పాటు అక్కడ ఉన్నవారు కూడా తెగ నవ్వారు. దీనికి సల్మాన్ కూడా సరదాగా స్పందిస్తూ, “అయన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, లేదంటే అనవసరంగా పుకార్లు వస్తాయి,” అంటూ జవాబిచ్చాడు.
హర్భజన్ ఈ వ్యాఖ్య ఎందుకు చేశాడంటే, గతంలో ఐశ్వర్య రాయ్ గురించి వివేక్ ఒబెరాయ్, సల్మాన్ మధ్య ప్రచారం సాగింది. అయినప్పటికీ, ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు. అయితే నెటిజన్లు ఈ వీడియోను సరదాగా ఆస్వాదిస్తున్నారు.
ఇదిలా ఉండగా, యువరాజ్, హర్భజన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కుటుంబంతో కాలం గడుపుతున్నారు. మరోవైపు, సల్మాన్ తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నారు.