బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు క్రికెట్ అభిమానుల కోసం రసవత్తరంగా సాగింది, కానీ రోహిత్ శర్మ తన అసహనంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఓవర్ వేసే సమయంలో, సిల్లీ మిడ్-ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్ వింతగా ఫీల్డింగ్ మోషన్ చేస్తుండటంతో రోహిత్ నుంచి హాస్యపూరితమైన సలహా వచ్చింది.
“ఏ జైస్సు, గల్లీ క్రికెట్ ఖేల్ రహా హై క్యా? నీచే బైత్ కే రెహ్. జబ్ తక్ బాల్ ఖేలేగా నహీ ఉత్నే కా నహీ,”( జైస్వాల్ గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బ్యాట్సమ్మెన్ బంతిని అదివరకు అలాగే వంగి ఫీల్డ్ చెయ్) అని చమత్కారంగా స్పందించాడు రోహిత్. దీనికి తక్షణమే స్పందనగా అభిమానులు సోషల్ మీడియాలో రోహిత్ స్పిరిట్‌ను ప్రశంసించారు. జైస్వాల్, సాధారణంగా తన ఫీల్డింగ్‌తో అందరిని ఆకర్షించే ఆటగాడు, ఈసారి తన ఫీల్డ్ లో ఒక చిన్న తప్పు చేశాడు, కానీ రోహిత్ అందుకు సరదాగా స్పందించాడు.
అయితే, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను చక్కగా ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత, మొదటి నలుగురు ఆటగాళ్లు అర్ధసెంచరీలు సాధించి, జట్టుకు శక్తివంతమైన ఆరంభాన్ని అందించారు.
Stump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂
The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a
— Star Sports (@StarSportsIndia) December 26, 2024