AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs LSG, IPL 2022: గేమ్ ఛేంజర్స్‌తో బరిలోకి దిగనున్న గుజరాత్, లక్నో టీంలు.. వీరుంటే ఆ కిక్కే వేరు..

ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య పోరు జరగనుంది. ఐపీఎల్‌లో ఇరు జట్లు తొలిసారి ఆడుతున్నాయి. ఇద్దరూ టోర్నీని గెలుపుతో ప్రారంభించాలని కోరుకుంటున్నారు.

GT vs LSG, IPL 2022: గేమ్ ఛేంజర్స్‌తో బరిలోకి దిగనున్న గుజరాత్, లక్నో టీంలు.. వీరుంటే ఆ కిక్కే వేరు..
Gt Vs Lsg
Venkata Chari
|

Updated on: Mar 28, 2022 | 4:15 PM

Share

ఐపీఎల్ 2022(IPL 2022) నాలుగో మ్యాచ్‌లో భాగంగా గుజరాత్, లక్నో(GT vs LSG) జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈసారి ఈ రెండు కొత్త జట్లు టోర్నీలో చేరాయి. రెండు జట్లలోనూ చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉండటంతో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. గుజరాత్ టైటాన్స్ కమాండ్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)కు ఇవ్వగా, లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మెగా వేలంలో రెండు జట్లూ చాలా మంది కీలక ఆటగాళ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా కాలం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలోకి రానున్నాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా అతను చాలా నెలలుగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ఈసారి అతను కొత్త పాత్రలో IPLకి తిరిగి రానున్నాడు. గత సీజన్‌లో పాండ్యా 12 మ్యాచ్‌ల్లో 127 పరుగులు మాత్రమే చేశాడు. ఫిట్‌నెస్ కారణంగా అతను బౌలింగ్ చేయలేకపోయాడు.

2. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి ఐపీఎల్‌లో గుజరాత్ తరపున ఆడనున్నాడు. రషీద్ IPLలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. చాలా సంవత్సరాలుగా హైదరాబాద్‌లో భాగంగా ఉన్నాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే సత్తా కూడా రషీద్‌కి ఉంది.

3. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను గుజరాత్ జట్టు డ్రాఫ్ట్ నుంచి ఎంపిక చేసింది. కోల్‌కతా జట్టుకు గిల్ చాలా ఏళ్లుగా ఓపెనర్‌గా నిలిచాడు. ఈ సమయంలో గుజరాత్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించడం చూడొచ్చు. గత సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 478 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు.

4. IPLలో అత్యుత్తమ కెప్టెన్సీతో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాట్‌తో చాలా భయాందోళనలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. అతను చాలా సీజన్లలో నిలకడగా అద్భుత ప్రదర్శన చేశాడు. అందువల్ల లక్నో జట్టును పటిష్టంగా తీర్చిదిద్దే బాధ్యత కేఎల్ రాహుల్ పైనే ఉంటుంది. గత సీజన్‌లో రాహుల్ 13 మ్యాచ్‌ల్లో 626 పరుగులు చేశాడు.

5. అత్యుత్తమ ఆటగాడు క్వింటన్ డి కాక్ ఈసారి లక్నోతో జత కలిశాడు. డికాక్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో చాలా పేరు సంపాదించాడు. మెగా వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో అతను ఒకడు. ఐపీఎల్ చివరి సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 297 పరుగులు చేశాడు. అతను ఓపెనర్ తుఫాన్ ఇన్నింగ్స్‌లు కూడా ఆడగలడు.

Also Read: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో స్టార్ ఆల్ రౌండర్ దూరం?

కేవలం 8 బంతులు.. 312 స్ట్రైక్‌రేట్‌‌తో మ్యాచ్ ఫలితానే మార్చిన తుఫాన్ ఇన్నింగ్స్.. బిత్తర పోయిన బౌలర్లు..