GT vs DC: తడబడిన ఢిల్లీ బ్యాటర్లు.. గుజరాత్ టైటాన్స్ రెండో విజయం..
Gujarat Titans vs Delhi Capitals Highlights: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు సాధించింది.
GT vs DC, IPL 2022: రెండో మ్యాచ్‌లో ఢిల్లీ తడబడింది. పూణే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. గుజరాత్ విధించిన 172 పరుగులు లక్ష్యాన్ని చేధించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ బౌలర్లలో ఫెర్గుసన్ 4 వికెట్లు పడగొట్టగా.. షమీ 2 వికెట్లు, పాండ్యా, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేవిడ్ మిల్లర్ 20, హార్దిక్ పాండ్యా 31 రాణించారు. మిగతా వారంతా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఢిల్లీ బౌలర్లలో రహ్మన్ 3, ఖలీల్ 2, కుల్దీప్ 1 వికెట్ పడగొట్టారు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్
LIVE Cricket Score & Updates
-
గుజరాత్ గెలుపు..
రెండో మ్యాచ్‌లో ఢిల్లీ తడబడింది. పూణే వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీనితో గుజరాత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది
-
18వ ఓవర్ మరో రెండు వికెట్లు..
ఢిల్లీ మరో రెండు వికెట్లు కోల్పోయింది. టార్గెట్ చేధించే క్రమంలో ఢిల్లీ బ్యాటర్లు తడబడుతున్నారు. 18వ ఓవర్ లో మరో రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. ఆ ఓవర్ పూర్తయ్యేసరికి 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
-
-
ఏడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. ఠాకూర్(2) ఏడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీనితో 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
-
ఒకే ఓవర్ లో రెండు వికెట్లు..
15వ ఓవర్ లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. పంత్(42), అక్షర్ పటేల్(8) వరుస బంతులకు పెవిలియన్ చేరారు. దీనితో 15వ ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
-
లలిత్ యాదవ్ రన్ ఔట్..
నాలుగో వికెట్ గా లలిత్ యాదవ్(25) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. విజయ్ శంకర్ బౌలింగ్ ఈ రనౌట్ జరగగా.. దీనితో ఢిల్లీ 95 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
-
-
పటిష్ట స్థితిలో ఢిల్లీ..
మొదటి మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత ఢిల్లీ పటిష్ట స్థితికి చేరుకుంది. లలిత్ యాదవ్(20), రిషబ్ పంత్(24) మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఇరువురూ స్కోర్ ను 10 ఓవర్లకు 79 పరుగులకు చేర్చారు.
-
పవర్ ప్లే సమయానికి మూడు వికెట్లు పతనం.. క్రీజులో పంత్..
172 పరుగుల టార్గెట్ చేధనలో భాగంగా ఢిల్లీ పవర్ ప్లే సమయానికి మూడు వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా(10), టీం సిఫెర్ట్(3), మనదీప్ సింగ్(18) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీనితో 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
ఢిల్లీ ఒకే ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రెండో వికెట్ గా పృథ్వీ షా పెవిలియన్ చేరగా.. మనదీప్ సింగ్ 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడో వికెట్‌గా అవుట్ అయ్యాడు. గుజరాత్ బౌలర్లలో ఫెర్గుసన్ రెండు వికెట్లు తీశాడు.
-
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
పృథ్వీ షా(10) రూపంలో ఢిల్లీ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. 4.1 ఓవర్‌లో ఫెర్గ్యూసెన్ బౌలింగ్‌లో శంకర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరకున్నాడు.
-
4 ఓవర్లకు స్కోర్..
4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఒక వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది. షా 10, సింగ్ 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
తొలి వికెట్ డౌన్..
భారీ స్కోర్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో టిమ్ షెపర్ట్(3) పెవిలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ టీం 8 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
-
ఢిల్లీ టార్గెట్ 172
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు సాధించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 172 టార్గెట్‌ను ఉంచింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేవిడ్ మిల్లర్ 20, హార్దిక్ పాండ్యా 31 రాణించారు. మిగతా వారంతా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఢిల్లీ బౌలర్లలో రహ్మన్ 3, ఖలీల్ 2, కుల్దీప్ 1 వికెట్ పడగొట్టారు.
-
శుభ్మన్ గిల్ ఔట్..
శుభ్మన్ గిల్ 84 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 145 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 46 బంతులు ఆడిన గిల్. 6 ఫోర్లు, 4 సిక్సులతో 84 పరుగులు సాధించాడు.
-
శుభ్మన్ గిల్ అర్థసెంచరీ
శుభ్మన్ గిల్ 32 బంతుల్లో తన హఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్ కెరీర్‌లో 11వది. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. ప్రస్తుతం గుజరాత్ టీం 13 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. హార్తిక్ 30 పరుగులతో గిల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం ఏర్పరుస్తున్నాడు.
-
రెండో వికెట్ డౌన్..
విజయ్ శంకర్ 13 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో 44 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో గిల్ 26, హార్దిక్ పాండ్యా ఉన్నారు.
-
మొదటి వికెట్ కోల్పోయిన జీటీ
పుణేలో జరుగుతున్న ఐపీఎల్ 2022 ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ మొదటి వికెట్ కోల్పోయింది.
-
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్
-
గుజరాత్ టైటాన్స్ జట్టు
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(కీపర్), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ
-
పాయింట్ల పట్టికలో ఇరుజట్ల పరిస్థితి
పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్ల స్థానం చూస్తే.. ఢిల్లీ జట్టు మూడో స్థానంలో ఉండగా, గుజరాత్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ పరంగా ఢిల్లీ ముందుంది.
Published On - Apr 02,2022 6:43 PM