AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs RR: ముంబై బౌలర్లను చితక్కొటిన బట్లర్.. ఈ సీజన్‌లో తొలి శతకం.. రోహిత్ సేన ముందు భారీ టార్గెట్..

Jos Buttler: రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2022లో తొలి సెంచరీ నమోదు చేశాడు. కేవలం 68 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు.

MI vs RR: ముంబై బౌలర్లను చితక్కొటిన బట్లర్.. ఈ సీజన్‌లో తొలి శతకం.. రోహిత్ సేన ముందు భారీ టార్గెట్..
Mi Vs Rr Jos Buttler
Venkata Chari
|

Updated on: Apr 02, 2022 | 5:27 PM

Share

ఈరోజు ఐపీఎల్‌లో డబుల్ హెడర్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం ఘనమైన ఆరంభంతో ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ మాత్రం ఉతికారేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2022(IPL 2022)లో తొలి సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. కేవలం 68 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. సెంచరీ చేశాక బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ టీం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. ముంబై ఈ మ్యాచ్‌లో గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేయాలి. RR ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో, బాసిల్ థంపి వేసిన ఒక ఓవర్‌లో జోస్ బట్లర్ 26 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో బట్లర్ చివరి 5 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. ఇక రాజస్థాన్ బ్యాటర్లలో శాంసన్ 30, హెట్మెయర్ 35 మాత్రమే రాణించారు. మిగతా వారంతా, సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ముంబై బౌలర్లలో బుమ్రా 3, మిల్స్ 3, పొలార్డ్ 1 వికెట్ పడగొట్టారు.

IPLలో సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు:

కే. పీటర్సన్ 103* vs డెక్కన్ ఛార్జర్స్ 2012

బీ. స్టోక్స్ 103* vs GL 2017

జే. బెయిర్‌స్టో 114 vs RCB 2019

బీ. స్టోక్స్ 107* vs MI 2020

జే. బట్లర్ 124 vs SRH 2021

జే. బట్లర్ 100 vs MI 2021

సంజు, బట్లర్ కీలక భాగస్వామ్యం

RR 48 పరుగుల స్కోరు వద్ద తొలి రెండు వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత జోస్ బట్లర్, కెప్టెన్ సంజూ శాంసన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 50 బంతుల్లో 82 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని శాంసన్ (30) ఔట్ చేయడం ద్వారా కీరన్ పొలార్డ్ బ్రేక్ చేశాడు.

రోహిత్ 150 క్యాచ్‌లు..

ఈ మ్యాచ్‌లో ఒక్క క్యాచ్‌తో రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌లో 150 క్యాచ్‌లను పూర్తి చేశాడు. ఈ ఫార్మాట్‌లో 150 క్యాచ్‌లు పట్టిన భారత్‌ నుంచి నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు ఎంఎస్ ధోని (200), దినేష్ కార్తీక్ (192), సురేశ్ రైనా (172) పేర్లు ఉన్నాయి.

ప్లేయింగ్ XI:

రాజస్థాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), దేవదత్ పడికల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ.

ముంబయి ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి.