KKR vs PBKS: బౌలర్‌కు సుస్సుపోయించిన రస్సెల్.. 225 స్ట్రైక్‌రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్..!
కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయి 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణించాడు. 15 బంతుల్లో 5 ఫోర్లు బాది 26 పరుగులు చేశాడు.
IPL 2022: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders vs Punjab Kings) మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. రస్సెల్(Andre Russell) రెచ్చిపోయి ఆడటంతో 33 బంతులు ఉండగానే మ్యాచ్ ముగిసింది. కేవలం 31 బంతులు ఆడిన రస్సెల్ 8 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిపోయి 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణించాడు. 15 బంతుల్లో 5 ఫోర్లు బాది 26 పరుగులు చేశాడు. సామ్ బిల్లింగ్స్ కూడా సేమ్ టు సేమ్. 23 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అజింక్య రహానె 12 పరుగులు చేశాడు.
మరీ ముఖ్యంగా ఓడియన్ స్మిత్ వేసిన 12వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రస్సెల్. స్మిత్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్, నో బాల్ సహా మొత్తం 24 పరుగులు రసెల్ పిండుకోగా.. చివరి బంతిని సామ్ బిల్లింగ్స్ సిక్సర్ సంధించడంతో మొత్తంగా ఆ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావడంతో పాటు స్మిత్‌కు రసెల్ చుక్కలు చూపించాడు.
Also Read: MI vs RR Live Score, IPL 2022: రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్.. స్కోరెంతంటే?