MI vs RR Highlights, IPL 2022: ముంబైకు తప్పని మరో ఓటమి.. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలుపొందిన రాజస్థాన్..
MI vs RR, Highlights in Telugu: రాజస్థాన్ విధించిన 193 పరుగులను చేరుకోలేక, ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 170 పరుగులకే పరిమితమైంది. దీంతో 23 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓటమిపాలైంది.
రాజస్థాన్ రాయల్స్ IPL 2022 సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించింది. రెండో టైటిల్ కోసం బరిలోకి దిగిన రాజస్థాన్, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ను 23 పరుగుల తేడాతో ఓడించి సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. జోస్ బట్లర్ సెంచరీ ఆధారంగా 193 పరుగులు చేసిన రాజస్థాన్, అనంతరం అనుభవజ్ఞులైన బౌలర్ల బలంతో ముంబైని కేవలం 170 పరుగులకే పరిమితం చేసింది. కొత్త సీజన్‌లో రాజస్థాన్ తన మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకోగా, ముంబై వరుసగా రెండవ ఓటమిని చవిచూసింది. చాహల్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై టీం.. ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఇషాన్, తిలక్ వర్మ 81 పరుగుల భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఇద్దరూ ఫిఫ్టీ కొట్టిన తర్వాత ఔట్ అయ్యారు. ఆ తర్వాత పొలార్డ్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
ముంబైపై మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాజస్థాన్ 190 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడల్లా గెలిచింది. 2014లో రాజస్థాన్‌పై 190 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. అనంతరం రాజస్థాన్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. దీంతో ముంబై 14.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. నేటి మ్యాచ్‌లోనూ ముంబై 190 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి
Key Events
రాజస్థాన్ టీం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై ఈ మ్యాచ్‌లో గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేయాలి.
రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2022లో తొలి సెంచరీ నమోదు చేశాడు. కేవలం 68 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు.
LIVE Cricket Score & Updates
-
ముంబై ఘోరపరాజయం..
రాజస్థాన్ విధించిన 193 పరుగులను చేరుకోలేక, ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 170 పరుగులకే పరిమితమైంది. దీంతో 23 పరగుల తేడాతో రోహిత్ సేన ఓటమిపాలైంది.
-
16 ఓవర్లకు ముంబై స్కోర్..
16 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ 0, అశ్విన్ 1 క్రీజులో ఉన్నారు. ముంబై విజయం సాధించాలంటే 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
15 ఓవర్లకు ముంబై స్కోర్..
15 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నారు. ముంబై విజయం సాధించాలంటే 30 బంతుల్లో 58 పరుగులు చేయాల్సి ఉంది.
-
ఇషాన్ కిషన్ ఔట్..
ఇషాన్ కిషన్ (54 పరుగులు, 43 బంతులు, 1 సిక్స్, 5 ఫోర్లు)ను బోల్ట్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబై టీం 121 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.
-
రోహిత్ ఔట్..
భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు రెండో ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మ(10పరుగులు, 5 బంతులు, 1 సిక్స్)ను ప్రసిద్ధ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబై టీం 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడింది.
-
-
ముంబై ముందు భారీ టార్గెట్..
రాజస్థాన్ టీం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది. ముంబై ఈ మ్యాచ్‌లో గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేయాలి.
-
మూడో వికెట్ డౌన్..
రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ (30 పరుగులు, 21 బంతులు, 1ఫోర్, 3 సిక్సులు) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం 130 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అయితే శాంసన్, బట్లర్ కేవలం 50 బంతుల్లో 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించి, రాజస్థాన్‌ను భారీ స్కోర్ దిశగా అడుగులు వేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, పొలార్డ్ వీరి భాగస్వామ్యానికి బ్రేకులు వేశాడు.
-
బట్లర్ అర్థ సెంచరీ
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ కేవలం 32 బంతుల్లో తన అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 5 ఫోర్లు, 4 సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు.
-
రెండో వికెట్ డౌన్..
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న రాజస్థాన్ టీం పడిక్కల్ (7) రూపంలో వికెట్ కోల్పోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం 48 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
-
తొలి వికెట్ డౌన్..
టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న రాజస్థాన్ టీం ముంబై బౌలర్ బుమ్రా దెబ్బకు తొలి వికెట్‌ను కోల్పోయింది. జైస్వాల్ (1) టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి టీం స్కోర్ 13 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.
-
ముంబయి ఇండియన్స్ జట్టు
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి
-
రాజస్థాన్ రాయల్స్ జట్టు
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ
-
టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్
కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత రాజస్థాన్ రాయల్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
-
ముంబై ఇండియన్స్‌కు తిరిగొచ్చిన సూర్యకుమార్
సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉండడంతో మళ్లీ జట్టులోకి రావడం ముంబై జట్టుకు విశేషం. రాజస్థాన్‌పై జట్టును బలోపేతం చేసిన అతను జట్టులో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారనున్నాడు.
-
ముంబై, రాజస్థాన్ మధ్య ముఖాముఖి పోరు..
ఈరోజు ముంబైలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఓటమితో ప్రారంభమైన ముంబై జట్టు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 25 మ్యాచ్‌ల్లో ముంబై 13, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
Published On - Apr 02,2022 2:42 PM