AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs RR Result, IPL 2022: రోహిత్ సేనకు షాకిచ్చిన రాజస్థాన్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఘన విజయం..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజయాల ఖాతాను శనివారం కూడా తెరవలేకపోయింది. దీంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. డివై పాటిల్ స్టేడియంలో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

MI vs RR Result, IPL 2022: రోహిత్ సేనకు షాకిచ్చిన రాజస్థాన్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఘన విజయం..
Mi Vs Rr Result, Ipl 2022
Venkata Chari
|

Updated on: Apr 02, 2022 | 7:42 PM

Share

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజయాల ఖాతాను శనివారం కూడా తెరవలేకపోయింది. దీంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. డివై పాటిల్ స్టేడియంలో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. చాహల్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ ఆటగాడు బట్లర్ సెంచరీతో స్కోరును 193కు చేర్చాడు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై టీం.. ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఇషాన్, తిలక్ వర్మ 81 పరుగుల భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఇద్దరూ ఫిఫ్టీ కొట్టిన తర్వాత ఔట్ అయ్యారు. ఆ తర్వాత పొలార్డ్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

ముంబైపై మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రాజస్థాన్ 190 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసినప్పుడల్లా గెలిచింది. 2014లో రాజస్థాన్‌పై 190 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. అనంతరం రాజస్థాన్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. దీంతో ముంబై 14.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. నేటి మ్యాచ్‌లోనూ ముంబై 190 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్