CSK vs PBKS IPL 2022 Match Preview: చెన్నై విజయాల బాట పట్టేనా.. పంజాబ్‌తో పోరుకు సిద్ధం.. ప్లేయింగ్ XIలో మార్పులు?
Chennai Super kings vs Punjab Kings Predicted Playing XI: చెన్నై ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా, పంజాబ్ ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయింది.
ఐపీఎల్‌లో గత విజేత చెన్నై సూపర్ కింగ్స్( (Chennai Super Kings)) IPL-2022 ( IPL 2022)లో మాత్రం వరుస ఓటములతో సతమతమవుతోంది. ఆ జట్టు రెండు తొలి మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చెన్నైపై విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో చెన్నై జట్టు తలపడనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్ రెండో మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు జట్లూ ఓటమి నీడను వీడి విజయపథంలోకి రావాలని ప్రయత్నిస్తాయి.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై జట్టు ఒకటి. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఈ జట్టు నాలుగు టైటిళ్లను కైవసం చేసుకుంది. కానీ ఈ సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని రవీంద్ర జడేజాకు కమాండ్ అప్పగించాడు. జట్టు వారసత్వాన్ని నిలబెట్టుకోవడం జడేజాకు సవాల్‌గా మారింది.
చెన్నై ప్లేయింగ్ XIలో మార్పులు..
చివరి మ్యాచ్ చూస్తే.. ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో చెన్నై జట్టు దిగింది. తొలి మ్యాచ్ ఆడిన ఆడమ్ మిల్నేని ఔట్ చేసి, ముఖేష్ చౌదరితో కలిసి మైదానంలోకి దిగింది. అయితే ఈ బౌలర్ రాణించలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడమ్ మిల్నే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. భారత అండర్-19 జట్టుతో ప్రపంచకప్ ఆడిన క్రిస్ జోర్డాన్ లేదా రాజ్‌వర్ధన్ హెంగెర్‌గేకర్‌లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం కల్పించే అవకాశం కూడా ఉంది.
పంజాబ్ ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?
మరోవైపు, పంజాబ్ జట్టును పరిశీలిస్తే, అందులో కూడా కొన్ని మార్పులు చూడొచ్చు. అండర్-19 ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్న రాజ్ బావాకు ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అవకాశం వచ్చినా అద్భుతంగా ఏమీ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదు. అతని స్థానంలో ప్రభసిమ్రాన్ సింగ్‌కి అవకాశం దక్కవచ్చు. లేదా మిడిలార్డర్‌కు బలం చేకూర్చే అర్థవ టైడే కూడా జట్టులోకి రావచ్చు.
పైచేయి ఎవరిది?
గత 15 సీజన్లలో ఇరు జట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 26 మ్యాచ్‌ల్లో చెన్నై 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 10 విజయాలను సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఏప్రిల్ 16న జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోని (కీపర్), డ్వేన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్ధన్ హెంగ్రాక్/క్రిస్ జోర్డాన్
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుకా రాజపక్సే (కీపర్), లియామ్ లివింగ్‌స్టన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్/అర్థవ్ టైడే, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్.
Also Read: MI vs RR Result, IPL 2022: రోహిత్ సేనకు షాకిచ్చిన రాజస్థాన్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఘన విజయం..
GT vs DC Live Score, IPL 2022: ఢిల్లీ టార్గెట్ 172.. హాఫ్ సెంచరీతో ఆకట్టకున్న గిల్..