Google Shows Ravi Shastri Age Wrong: ఎవరికి ఏ చిన్న సమాచారం కావాలన్నా వచ్చే సమాధానం గూగుల్ ఒకటే. పలానా ప్రశ్నకు సమాధానం తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. ‘గూగుల్‌లో చూడు’ అనే ఆన్సర్ వస్తుంది. మరి ఆ గూగుల్ తప్పుడు సమాధానం ఇస్తే.?
తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. మాజీ టీమిండియా ప్లేయర్ రవిశాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్లేయర్‌గా, కామెంటర్‌గా, టీమిండియా కోచ్‌గా ఎన్నో ఎనలేని సేవలందించాడు రవిశాస్త్రి. ఇలాంటి గొప్ప ప్లేయర్ విషయంలో గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుడు సమాచారం ఇస్తోంది. రవిశాస్త్రి వయసు ఎంత అని గూగుల్‌లో టైప్ చేస్తే.. ‘120’ ఏళ్లు అని చూపిస్తోంది. రవిశాస్త్రి 1900 సంవత్సరం మే 27న జన్మించాడని చూపిస్తోంది. దీంతో ఈ విషయాన్ని గమనించిన క్రికెట్ అభిమానులు గూగుల్ పప్పులో కాలేసింది, గూగుల్‌కు ఈ మాత్రం తెలియదా అంటూ నెట్టింట్లో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రవిశాస్త్రి వికీపిడియా క్లిక్ చేస్తే మాత్రం సరైన సమాచారాన్ని చూపిస్తుంది. 1962 మే 27న జన్మించిన రవిశాస్త్రి వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. రవిశాస్త్రి ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.