India vs England: ‘నా పేరు వాషింగ్టన్‌.. నేను డీసికి వెళ్లాలనుకుంటున్నా’.. వైరల్‌గా మారిన పంత్‌ ఫన్నీ కామెంట్స్‌..

తాజాగా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మైదానంలో చేసిన కొన్ని వ్యాఖ్యాలు నవ్వులు పూయిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. చెన్నై వేదికగా ఇండియా, ఇంగ్లాండ్‌ జట్టుల మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ శుక్రవారం ప్రారంభమైన..

India vs England: 'నా పేరు వాషింగ్టన్‌.. నేను డీసికి వెళ్లాలనుకుంటున్నా'.. వైరల్‌గా మారిన పంత్‌ ఫన్నీ కామెంట్స్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 06, 2021 | 12:06 AM

Punt Funny Comment On Washington Sundar: క్రికెట్‌ అంటేనే ఉత్కంఠ, సంతోషం, భావోద్వేగం.. అప్పుడప్పుడు ఫన్నీ సంభాషణలు ఇవన్నీ కలిసిఉంటాయి కాబట్టే ఈ ఆటకు కోట్లాది మంది అభిమానులుంటారు. ఇక మ్యాచ్‌ మధ్యలో జరిగే సంభాషణలు, సన్నివేశాలు సైతం అప్పుడప్పుడు క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటాయి. తాజాగా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మైదానంలో చేసిన కొన్ని వ్యాఖ్యాలు నవ్వులు పూయిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. చెన్నై వేదికగా ఇండియా, ఇంగ్లాండ్‌ జట్టుల మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మ్యాచ్‌ జరుగుతోన్న సందర్భంలో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 70వ ఓవర్‌ వేయడానికి బౌలర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ బాల్‌తో సిద్ధమయ్యాడు. ఈ సమయంలో వికెట్ల వెనకాల ఉన్న రిషబ్‌ పంత్‌.. ‘నా పేరు వాషింగ్టన్‌.. నేను డీసికి వెళ్లాలనుకుంటున్నాను’ అంటూ కామెంట్‌ చేశాడు. పంత్‌ చేసిన ఈ వ్యాఖ్యలు స్టంపింగ్‌ మైక్‌లో రికార్డు కావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వైపు సీరియస్‌గా మ్యాచ్‌ ఆడుతూనే మధ్యమధ్యలో ఇలా నవ్వులు పూయిస్తూ పంత్‌ సహచర క్రికెటర్లలో జోష్‌ నింపుతున్నాడమన్నమాట.

Also Read: Ravi Shastri Age: టీమిండియా కోచ్.. రవిశాస్త్రి వయసు 120 ఏళ్లా..? పప్పులో కాలేసిన గూగుల్‌..