AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సూపర్ మ్యాన్‌కే మెంటల్ ఎక్కించావ్‌గా.. గాల్లోకి దూకి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. షాక్‌లోనే పెవిలియన్ చేరిన బ్యాటర్..

Glenn Phillips Catch Video: ఆస్ట్రేలియా తరపున తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లాబుస్‌చాగ్నే అత్యధికంగా 90 పరుగులు చేశాడు. అతను నెమ్మదిగా తన సెంచరీ వైపు కదులుతున్నాడు. కానీ, గ్లెన్ ఫిలిప్స్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో దీనిని అనుమతించలేదు. టిమ్ సౌథీ వేసిన బంతిపై మార్నస్ లాబుస్‌చాగ్నే షాట్ ఆడాడు. కానీ, లేన్‌లో నిలబడిన గ్లెన్ ఫిలిప్స్ గాలిలోకి దూకి దానిని కేవలం ఒక చేత్తో పట్టుకున్నాడు.

Video: సూపర్ మ్యాన్‌కే మెంటల్ ఎక్కించావ్‌గా.. గాల్లోకి దూకి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. షాక్‌లోనే పెవిలియన్ చేరిన బ్యాటర్..
Glenn Phillips Catch Video
Venkata Chari
|

Updated on: Mar 09, 2024 | 10:08 PM

Share

న్యూజిలాండ్ క్రికెట్ టీమ్(New Zealand Cricket Team) స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) తన బ్యాటింగ్ కంటే ఫీల్డింగ్‌కే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి క్యాచ్‌లు తీయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు క్రైస్ట్‌చర్చ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో, అతను అలాంటి అద్భుతమైన క్యాచ్‌ను తీసుకున్నాడు. అతను ఔట్ అయ్యాడని బ్యాట్స్‌మన్ నమ్మలేదు. అలాంటి షాకింగ్ క్యాచ్‌తో షాకిచ్చాడు. ఫిలిప్స్ గాలిలో దూకి మార్నస్ లాబుస్చాగ్నే క్యాచ్ పట్టి పెవిలియన్ దారి చూపించాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే పరిమితమైంది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. కివీస్ జట్టులో మాట్ హెన్రీ 23 ఓవర్లలో 4 మెయిడిన్లతో 67 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

క్యాచ్‌తో ఆశ్చర్యపరిచిన గ్లెన్ ఫిలిప్స్..

ఆస్ట్రేలియా తరపున తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లాబుస్‌చాగ్నే అత్యధికంగా 90 పరుగులు చేశాడు. అతను నెమ్మదిగా తన సెంచరీ వైపు కదులుతున్నాడు. కానీ, గ్లెన్ ఫిలిప్స్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో దీనిని అనుమతించలేదు. టిమ్ సౌథీ వేసిన బంతిపై మార్నస్ లాబుస్‌చాగ్నే షాట్ ఆడాడు. కానీ, లేన్‌లో నిలబడిన గ్లెన్ ఫిలిప్స్ గాలిలోకి దూకి దానిని కేవలం ఒక చేత్తో పట్టుకున్నాడు. ఫిలిప్స్ ఈ అద్భుతమైన క్యాచ్‌ను చూసి, వ్యాఖ్యాతలు, అభిమానులే కాదు, మార్నస్ లాబెసన్ కూడా ఆశ్చర్యపోయారు. ఆ క్యాచ్‌ను నమ్మలేకపోయాడు. షాకవుతూనే పెవిలియన్ బాట పట్టాడు.

ఫిలిప్స్ ఈ అద్భుతమైన క్యాచ్ వీడియోను మీరు కూడా చూడండి..

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు ఇన్నింగ్స్‌లో అతను ఏడు వికెట్లు పడగొట్టాడు. దీనితో మాట్ హెన్రీ పేరిట భారీ రికార్డు కూడా నమోదైంది. ఆస్ట్రేలియాపై సొంతగడ్డపై న్యూజిలాండ్ బౌలర్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఈ సందర్భంలో, అతను మాజీ వెటరన్ స్పిన్నర్ డేనియల్ వెట్టోరి రికార్డును బద్దలు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..