AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఆ విషయంలో తొలిసారి మౌనం వీడిన ద్రవిడ్.. ఇషాన్, అయ్యర్ విషయంలో అసలేం జరిగిందంటే?

Rahul Dravid On Ishan Kishan, Shreyas Iyer Future: టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు జట్టు నుంచి తన పేరును ఉపసంహరించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియాలో కనిపించలేదు. కానీ, కిషన్ ఆఫ్రికా టూర్ నుంచి వైదొలిగిన తర్వాత, జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కిషన్‌కు దేశవాళీ క్రికెట్ ఆడమని సలహా ఇచ్చాడు. కానీ, ఇషాన్ రంజీ ఆడేందుకు వెనుకాడాడు.

Team India: ఆ విషయంలో తొలిసారి మౌనం వీడిన ద్రవిడ్.. ఇషాన్, అయ్యర్ విషయంలో అసలేం జరిగిందంటే?
Rahul Dravid
Venkata Chari
|

Updated on: Mar 10, 2024 | 3:02 PM

Share

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిసింది. ఊహించినట్లుగానే భారత జట్టు (India vs England) ఈ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుంది. ధర్మశాలలో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించి 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు తమ అద్భుత ఆటతీరుతో టెస్టుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా తమ ఆట తీరుతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ సిరీస్‌తో పాటు ఇషాన్ కిషన్ (Ishan Kisan), శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి మినహాయించడం భారత క్రికెట్‌లో సంచలనం సృష్టించిన వార్తగా నిలిచింది. బీసీసీఐ తీసుకున్న ఈ ఆకస్మిక చర్యపై చాలా అనుకూల-ప్రతిపక్ష చర్చలు జరిగాయి. ఈ ఇద్దరు క్రికెటర్ల విషయంలో బీసీసీఐ వైఖరిని కొందరు క్రికెట్ మాజీలు ప్రశంసించగా, మరికొందరు ఇతర క్రికెటర్లను ఉదాహరణగా చూపుతూ బీసీసీఐ చర్యను విమర్శించారు. అయితే, దీనిపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. టెస్ట్ సిరీస్ విజయం తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, ఇద్దరు ఆటగాళ్ల విడుదల, జట్టులో వారి భవిష్యత్తుపై మొదటిసారి వ్యాఖ్యానించారు.

మాటవినని కిషన్- శ్రేయాస్‌..

టీమిండియా యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు జట్టు నుంచి తన పేరును ఉపసంహరించుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియాలో కనిపించలేదు. కానీ, కిషన్ ఆఫ్రికా టూర్ నుంచి వైదొలిగిన తర్వాత, జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కిషన్‌కు దేశవాళీ క్రికెట్ ఆడమని సలహా ఇచ్చాడు. కానీ, ఇషాన్ రంజీ ఆడేందుకు వెనుకాడాడు. అతనితో పాటు, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ తర్వాత అయ్యర్ కూడా జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఆ సమయంలో భారత జట్టులో లేని ఆటగాళ్లను రంజీ ట్రోఫీ ఆడాలని బోర్డు కార్యదర్శి జై షా ఆదేశించారు. అయితే, ఇద్దరు ఆటగాళ్లు రంజీ ఆడేందుకు వెనుకాడారు. దీంతో అసంతృప్తికి గురైన బీసీసీఐ ఈ ఇద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది.

ద్రవిడ్ ఏం చెప్పాడంటే?

ధర్మశాల టెస్ట్ విజయం తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను విలేకరుల సమావేశంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల గురించి ప్రశ్నలు అడిగారు. ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికీ టీమ్ ఇండియా ప్రణాళికల్లో భాగమేనని ద్రవిడ్ సమాధానమిచ్చాడు. జట్టు ప్రణాళికలో తాను ఎప్పుడూ భాగమేనని, దేశవాళీ క్రికెట్‌లో ఆడే వారు ఎప్పుడూ జట్టులో భాగమేనని చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించడంలో తన పాత్ర లేదంటూ ద్రవిడ్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

ద్రవిడ్ మాట్లాడుతూ.. ఏ ఆటగాడికి కాంట్రాక్ట్ దక్కుతుందో నిర్ణయించేది నేను కాదు. దీనిపై బోర్డు, సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. అలాగే నాకు కాంట్రాక్ట్ క్రైటీరియా తెలియదు. 15 మంది ఆటగాళ్ల జట్టును ఎంపిక చేసేటప్పుడు నా అభిప్రాయం మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో మాట్లాడి ప్లేయింగ్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటాను. అంతే కాకుండా ఆటగాళ్లకు కాంట్రాక్ట్ ఉందా లేదా అన్నది నా పరిధిలోకి రాదంటూ తేల్చి పారేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..