AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ! డ్రెస్సింగ్ రూమ్‌లో అరుపులు కేకలు..

వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నిరాశగా ముగిసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను తీవ్రంగా మందలించారు. ఈ ఓటమి టీమిండియాకు, ముఖ్యంగా సూర్యవంశీకి తొలి అనుభవం. గెలుపొందాల్సిన మ్యాచ్ ఓడిపోవడం గంభీర్ ఆగ్రహానికి ప్రధాన కారణం.

గంభీర్ కోపాన్ని తొలిసారి చూసిన వైభవ్ సూర్యవంశీ! డ్రెస్సింగ్ రూమ్‌లో అరుపులు కేకలు..
Vaibhav Suryavanshi And Gam
SN Pasha
|

Updated on: Jul 05, 2026 | 11:55 AM

Share

టీమిండియా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేశాడు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బుడ్డోడి ఎంట్రీ జరిగిపోయింది. శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ అరంగేట్రం చేసి.. ఓ రెండు భారీ సిక్సులతో అందరినీ అలరించాడు. అయితే ఆశించిన స్థాయిలో రాణించలేదు. పైగా టీమిండియా ఓటమి పాలైంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంతోషం వైభవ్‌కు ఎక్కువ సేపు ఉండలేదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇంగ్లాండ్‌పై గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా టీమిండియా ఓడిపోవడంతో హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వాడీవేడి మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇంత కంటే దిగజారలేం అని చేసిన వ్యాఖ్యలని బట్టి చూస్తే.. ఈ ఓటమి టీమిండియాను ఎంత హర్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అసలే ఓటమి అంటే ఒప్పుకొని గంభీర్.. దీన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ ముగిశాక.. డ్రెస్సింగ్ రూమ్‌‌లో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి.. ఆటగాళ్లను ఏకిపారేసినట్లు సమాచారం.

ఇంగ్లాండ్ ఓపెనర్లును డకౌట్ చేసి, మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్న తర్వాత కూడా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన గంభీర్.. టీమ్ మొత్తాన్ని ఒక రౌండ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకరిద్దరు ప్లేయర్లను టార్గెట్ చేయకుండా జట్టు మొత్తానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడంట. అయితే వైభవ్ సూర్యవంశీకి డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే తొలిసారి. పైగా హెడ్ కోచ్ గంభీర్ ఓటమి వస్తే ఎంత సీరియస్‌గా ఉంటాడో కూడా వైభవ్ చాలా దగ్గరి నుంచి చూసి ఉంటాడు. గంభీర్ ఇంత సీరియస్ అవ్వడానికి కూడా కారణం ఉంది. వరల్డ్ ఛాంపియన్ టీమ్.. ఐర్లాండ్‌పై రెండు మ్యాచ్‌లు, ఇప్పుడు ఇంగ్లాండ్‌పై గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us