
Longest Sixes in IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ మ్యాచ్‌లలో సగానికి పైగా అయిపోయాయి. ఇప్పటివరకు ఆడిన 42 మ్యాచ్‌లలో కొందరు ఆటగాళ్ళు తమ తుఫాన్ ప్రదర్శనలతో ప్రేక్షకులతోపాటు అభిమానులను అలరించారు. ఒకవైపు బౌలర్లు తమ లైన్-లెంగ్త్ తో బ్యాట్స్ మెన్స్‌ను ఇబ్బంది పెడితే, మరోవైపు కొంతమంది బ్యాటర్లు తమ తుఫాన్ బ్యాటింగ్ తో సత్తా చాటారు. ఈ క్రమంలో కొంతమంది బ్యాటర్లు భారీ సిక్స్‌లతో షాకిచ్చారు. అసలు ఐపీఎల్ 2025 లో భారీ సిక్సర్లు బాదిన ఆరుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. అనికేత్ వర్మ: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన 23 ఏళ్ల బ్యాట్స్‌మన్ అనికేత్ వర్మ ఐపీఎల్ 2025లో తన డేంజరస్ బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అదే సమయంలో, అతని బ్యాట్ నుంచి ఎన్నో సిక్సర్లు, ఫోర్లు కూడా కనిపించాయి. అతను తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 190 పరుగులు చేశాడు. అదే సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 102 మీటర్ల సిక్స్ కొట్టాడు.
2. నికోలస్ పూరన్: లక్నో సూపర్ జెయింట్స్ వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఐపీఎల్ (IPL) 2025లో పొడవైన సిక్స్ కొట్టిన ఐదవ ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 102 మీటర్ల సిక్స్ కొట్టడంలో విజయం సాధించాడు. ఈ సీజన్‌లో భారీ సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా నికోలస్ పూరన్ రికార్డ్ సాధించాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో పూరన్ 31 సిక్సర్లు, 32 ఫోర్లతో 377 పరుగులు చేశాడు.
3. ట్రావిస్ హెడ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోవచ్చు. కానీ, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 105 మీటర్ల సిక్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని బ్యాట్ తొమ్మిది మ్యాచ్‌ల్లో రెండు అర్ధ సెంచరీలతో 261 పరుగులు చేసింది.
4. ఫిల్ సాల్ట్: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ 105 మీటర్ల సిక్స్ కొట్టాడు. దీంతో, అతను IPL 2025లో పొడవైన సిక్స్ కొట్టిన మూడవ బ్యాట్స్‌మన్ అయ్యాడు.
5. అభిషేక్ శర్మ: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2025లో నిలకడగా బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌పై సెంచరీ చేసిన ఈ ఆటగాడు తొమ్మిది మ్యాచ్‌ల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 240 పరుగులు చేశాడు. ఇంతలో అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి 106 మీటర్ల భారీ సిక్స్ బాదేశాడు.
6. హెన్రిచ్ క్లాసెన్: IPL 2025లో ఇప్పటివరకు అత్యంత పొడవైన సిక్స్ కొట్టిన ఆటగాడిగా హెన్రిచ్ క్లాసెన్ రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 107 మీటర్ల సిక్స్ కొట్టాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో, అతను 36 సగటుతో 288 పరుగులు చేయగలిగాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..