5 Players Mumbai Indian Could Retain Ahead IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ (MI) ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆ జట్టు 14 మ్యాచ్‌లు ఆడగా 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే, IPL 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ చాలా మంది కీలక ఆటగాళ్లను విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఇందులో ఓ పేరు కచ్చితంగా ఆశ్చర్యపరిచేలా ఉంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా చేరిందంట. అతను రాబోయే సీజన్‌లో వేరే జట్టుతో ఆడొచ్చని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత, రోహిత్ శర్మకు ఫ్రాంచైజీకి మధ్య సంబంధంలో ఉద్రిక్తత ఏర్పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అదే సమయంలో, ముంబై ఇండియన్స్ ఏ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేయాలనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ జాబితాలో ముగ్గురు స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారి పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2024కి ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో ట్రేడ్ చేసింది. పాండ్యా కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉన్నప్పటికీ, ఫ్రాంచైజీ అతనికి మరో అవకాశం ఇవ్వాలని కోరుతోంది. పాండ్యాను కెప్టెన్‌గా చేయడానికి, ఫ్రాంచైజీ తన వెటరన్ ఆటగాడు రోహిత్ శర్మకు షాకిచ్చింది.
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒకరు. ఈ బౌలర్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఇష్టపడని జట్టు ప్రపంచంలో ఏదీ ఉండదు. జస్ప్రీత్ బుమ్రా చాలా ప్రమాదకరమైన బౌలర్. ఓడిపోయే మ్యాచ్‌లో కూడా జట్టును గెలిపించగల సామర్థ్యం కలిగి ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
మిస్టర్ 360 డిగ్రీల బ్యాటింగ్ అంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫ్రాంచైజీకి చెందిన అత్యంత విశ్వసనీయమైన ఆటగాళ్లలో ఒకరు. 2018 నుంచి సూర్య జట్టును వీడలేదు. IPL 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ తన స్టార్ బ్యాట్స్‌మన్‌ని రిటైన్ చేసుకోవచ్చిన తెలుస్తోంది. సూర్య లాంటి దూకుడు బ్యాట్స్‌మెన్ ఉండటంతో జట్టులో మిడిలార్డర్ చాలా బలంగా కనిపిస్తోంది.
టీ20 ఫార్మాట్‌లో ప్రమాదకరమైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ డేవిడ్ ఒకడు. అతను 2022లో ఫ్రాంచైజీలో చేరాడు. అతనికి అవకాశం దొరికినప్పుడల్లా, అతను ఫ్రాంచైజీ వాగ్దానానికి అనుగుణంగా కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టగల సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్‌లలో డేవిడ్ ఒకడు. ఇలాంటి బ్యాట్స్‌మెన్‌ను ఏ ఫ్రాంచైజీ కోల్పోవాలని కోరుకోదు.
29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార ముంబై ఇండియన్స్ రిటైన్ చేయగల రెండవ విదేశీ ఆటగాడు. ఎంఐ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగకు తుషార ప్రత్యేకం. దీనితో పాటు, కుడిచేతి వాటం బౌలర్ కూడా పరుగులు ఇవ్వడంలో కఠినంగా, వికెట్లు తీయడంలో దూకుడుగా ఉంటాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..